బెజవాడ దుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత, భారీగా బిల్లు బకాయి..!!
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రికి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయటం సంచలనంగా మారుతోంది. పెద్ద మొత్తంలో బిల్లు బకాయి ఉన్న కారణంగానే సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఎవరి అత్యుత్సాహంతో ఈ నిర్ణయం జరిగిందనేది కీలకంగా మారుతోంది.
విజయవాడ దుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోవటం సంచలనంగా మారింది. దుర్గా మల్లే శ్వరస్వామి దేవస్థానం నుంచి మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని, 2023 ఫిబ్రవరి నుంచి ఒక్క నయాపైసా కూడా బకాయి చెల్లించకుండా విద్యుత్తు వాడుకుంటోందన్నది ఏపీసీపీడీసీఎల్ ఆరోపిస్తోంది. అనేకసార్లు నోటీసులు జారీ చేసినా దుర్గగుడి అధికారుల్లో స్పందన లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు.

దీనికి సంబంధించిన బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఇవాళ ఉదయం చర్యలకు సన్నద్ధం అవుతామని దుర్గగుడి ఈవోకు ముందస్తు సమాచారం ఇచ్చింది. దుర్గగుడి అధికారులు మాత్రం తాము సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి అందిస్తున్నామని నెట్‌మీటరింగ్ కోరుతూ అనేకసార్లు లేఖలు రాసినా, నేరుగా మాట్లాడినా విద్యుత్ అధికారుల నుంచి స్పందన లేదని చెబుతున్నారు.
కాగా, ఈ వ్యవహారం దేవస్థానం, విద్యుత్ శాఖ మధ్య వివాదాస్పదంగా మారింది. ఇటీవల అమ్మ వారి ఆలయానికి ఏపీసీపీడీసీఎల్ ఉన్నతాధికారులు వచ్చిన సమయంలోనూ దేవస్థానం ఈవో, పాలకమండలి మధ్య చర్చ జరిగింది. పాతపాడులోని ఐదు ఎకరాల్లో కోట్ల రూపాయలను వెచ్చించి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం సౌరవిద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ వినియో గంలోకి తేవడానికే తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు సోలార్‌ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతోన్న విద్యుత్తును నున్నకు సమీపంలోని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
ప్రస్తుతానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి ఆలయంలో దర్శనానికి జనరేటర్ సహాయంతో విద్యుత్తును కొనసాగిస్తున్నారు. కాగా, విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై మంత్రి గొట్టిపాటి స్పందించారు. ఏపీసీపీడీసీఎల్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని అధికారులను ఆదేశించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications