Salaar Teaser.. వేణుస్వామి జాతకమే నిజమవుతోందా..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని నటీనటులకు ఎప్పుడెప్పుడు ఏమేం జరగబోతున్నాయో చెబుతున్న వేణుస్వామిపై అందరికీ గురి కుదురుతున్నట్లుంది. కొన్ని సంఘటనలను ఆయన ప్రస్తావించగా కాలక్రమంలో అవన్నీ నిజమయ్యాయి. సినీ పరిశ్రమలో తర్వాత ఏం జరగబోతోంది? వేణుస్వామి ఎవరి గురించి ఏం చెప్పారు? అంటూ నెటిజన్లు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నారు. ప్రభాస్ విషయంలో కూడా వేణుస్వామి చెప్పిందే నిజమవుతోందా? అనే అనుమానాన్ని సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ బాహుబలి సినిమాతోనే అత్యంత భారీ స్టార్ డమ్ ను చవిచూశారని, ఆయన నుంచి అన్నీ పరాజయం పాలయ్యే సినిమాలే వస్తాయని వేణుస్వామి చెబుతున్నారు. ఆయన చెప్పినట్లుగా సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ బాహుబలి స్థాయిలో హిట్ అవదని, సాధారణమైన సినిమాగా మిగులుతుందన్నారు. అయితే చివరకు అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. అభిమానుల ఆశలను ఆవిరి చేసింది.

తాజాగా సలార్ టీజర్ విడుదలైంది. కేజీఎఫ్ కలర్ టింట్ ను గుర్తుకు తెచ్చారు. మాస్ ఎలిమెంట్స్, బిల్డప్ షాట్స్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కేజీఎఫ్ లో కథ చెప్పినట్లుగానే సలార్ లో కూడా టినూ ఆనంద్ కథ చెబుతున్నారు. ప్రభాస్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమార్ కూడా కనిపించారు. టీజర్ ను పూర్తిగా యాక్షన్ పార్ట్ తో నింపేశారు. ఇందులో ఉన్న పోరాట సన్నివేశాలతోపాటు యాక్షన్ మూమెంట్స్ కూడా కేజీఎఫ్ ను గుర్తుకు తెస్తున్నాయి.
సినిమా విడుదలైనప్పుడు మాత్రమే దర్శకుడు నీల్ కేజీఎఫ్ నుంచి బయటకు వచ్చారా? రాలేదా? అనేది తేలుతుంది. ప్రభాస్ అభిమానులు సలార్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను దర్శకుడు, హీరో అందుకుంటారా? లేదా? అనేది సెప్టెంబరు 28వ తేదీన తేలనుంది. టీజర్ లో కొత్త దనం ఏదీ లేకపోవడం, సాధారణ యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. కొంతమంది సినీ విశ్లేషకులు సలార్ టీజర్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications