ఎమ్మెల్యే గారూ.. ద‌య‌చేసి మా ఊరికి రావొద్దు.. మీకు దండం పెడ‌తాం!!

స‌మ‌స్య‌లను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ‌హిస్తున్న ప్ర‌జాప్ర‌తినిధిపై గ్రామ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ''ఎమ్మెల్యే గారూ..మా ఊరికి రావొద్దు''అంటూ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి వాసులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే (సంతనూతలపాడు) టీజేఆర్ సుధాక‌ర్‌బాబు క‌న‌ప‌ర్తి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు వారి గ్రామానికి సంబంధించిన ర‌హ‌దారిపై న‌ల్ల‌జెండాలు ప‌ట్టుకొని నిర‌స‌న తెలియ‌జేశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌లేద‌ని, మాయ‌మాట‌ల‌తో ఎమ్మెల్యే కాలం వెళ్ల‌దీస్తున్నారని మండిప‌డ్డారు. రాప‌ర్ల‌-చ‌వ‌ట‌పాలెం రోడ్డు దెబ్బ‌తిన‌డంతో తీవ్ర ఇక్క‌ట్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని, క‌నీసం గ్రావెల్ రోడ్డు కూడా నిర్మించాల‌ని కోరినా ఎమ్మెల్యే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Prakasam district Kanaparthi villagers Protest

అలాగే కుక్క‌ల‌వారిపాలెం-క‌న‌ప‌ర్తి ర‌హ‌దారిలో బుకింగ్‌హాం కాల్వ‌పై వంతెన నిర్మిస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చార‌ని, అది హామీల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. స‌చివాల‌య సిబ్బంది గ్రామంలోని ఓ నాయ‌కుడి క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తూ జ‌వాబుదారీత‌నాన్ని మ‌రిచిపోయార‌ని ఆరోపించారు. గ‌తంలో ఇదే గ్రామంలో ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌నుకున్న‌ప్ప‌టికీ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు. మ‌ళ్లీ తాజాగా ఇక్క‌డ జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మాన్ని మ‌రోసారి ఎమ్మెల్యే వాయిదా వేశారు. నిర‌స‌న‌లు ఎదుర‌వుతాయనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే త‌న కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకుంటే ఈసారి ఎన్నికల్లో సీటిస్తానని, లేదంటే ఇవ్వనంటూ ముఖ్యమంత్రి జగన్ ఖరాఖండిగా తేల్చేశారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు ఆరునెలల సమయం ఇచ్చారు. తర్వాత సీటివ్వలేదంటూ తనను దూషించినా పర్వాలేదని, గెలుపు గుర్రాలు అనుకుంటే సీటిస్తానని ముఖ్యమంత్రి చెప్పడంతో పరుగులు తీసిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్ల్ చెమటోడుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+