మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఏ పాత్ర పోషించినా అందులో ఒదిగిపోయి నటిస్తాడు. ఈ మధ్యకాలంలో కాస్తంత నెమ్మదించాడు. ప్రకాష్ రాజ్ లేకుండా భారీ ప్రాజెక్టుతో సినిమా రూపుదిద్దుకోదు అనే పేరు తెచ్చుకున్నాడు.
సినిమాలతోపాటు రాజకీయంగా కూడా నిలదోక్కుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బీజీపీ పై విరుచుకుపడుతుంటారు. రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. చిరంజీవి కుటుంబం మద్దతు పుష్కలంగా ఉన్నప్పటికీ మా ప్రెసిడెంట్ కాలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

మంచు విష్ణు ప్రెసిడెంట్ అయ్యాక గెలుపు ఓటములు సర్వసాధారణమేనని, ప్రెసిడెంట్ ని సైతం హామీలు నెరవేర్చకపోతే నిలదీసి హక్కు ఉంటుందని వ్యాఖ్యానించేవారు. అప్పుడు చెప్పినట్లుగానే నిరంతరం విష్ణుపై ఫైరవుతూనే ఉంటారు. రెండు సంవత్సరాల నుంచి ఆయన పనితీరు సున్నా అని ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. రెండు సంవత్సరాల నుంచి ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదన్నారు.
తను గెలిచిన తర్వాత మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు సొంత భవనం నిర్మిస్తామని చెప్పి.. గెలిచిన తర్వాత ఏమీ చేయలేదన్నారు. దీనిపై విష్ణు ని ఎన్నుకున్న సభ్యులంతా ఒకసారి ఆలోచించాలని, బోగస్ ఓట్లు అలాగే బయటి నుంచి వచ్చిన చాలామంది ఓట్లు వేయడం వల్లే ఆయన గెలిచారన్నారు. ఈ రెండేళ్లలో విష్ణు చేసిందేమీ లేదని పలువురు సెలబ్రిటీలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై విష్ణు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications