వికసిస్తున్న దోస్తీ: ఇంటింటికి టిడిపిలో కెసిఆర్ బొమ్మ
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. టిడిపి మద్దతుదారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోను కూడ ఏర్పాటు చేశారు.
అద్దంకి: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. టిడిపి మద్దతుదారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోను కూడ ఏర్పాటు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ ఏర్పాటు చేయకముందు టిడిపిలో ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం కోసం ఆయన టిఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారి పాలెంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు స్వాగతం పలుకుతూ సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో కూడా పెట్టారు.
వెలమవారిపాలెంలో 90 శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు నివసిస్తారు. ప్రస్తుత సర్పంచ్ మామిళ్ళపల్లి ప్రవీణ్‌కుమార్‌తోపాటు తండ్రి సాంబశివరావు కూడా టీడీపీ మద్దతుదారులు కావటంతో వారి అభిమానం ఫ్లెక్సీలలో ఉట్టిపడేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications