అద్భుత నృత్యం: దేవతలే వచ్చారన్న పోచారం(పిక్చర్స్)
హైదరాబాద్: కుటుంబ సమేతంగా తిలకించే కళలు కేవలం భారతదేశానివేనని, అమెరికా లాంటి దేశాలు మన దేశ కళలను అనుసరిస్తున్నాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం రవీంద్ర భారతలో ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి సంస్థ ఏడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణలో కళలకు ప్రోత్సాహం ఉంటుందని, రవీంద్ర భారతికి కోటి రూపాయల గ్రాంట్ ప్రకటించడమే దీనికి నిదర్శనమని అన్నారు. భారతదేశం ఎంత గొప్ప సంస్కృతికి నిలయమో దాన్ని చూసి ఆనందం పొందే వారికే అర్థమవుతుందని చెప్పారు.
మంత్రి పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రవీంద్ర భారతిలో దేవతలు దిగివచ్చిన వేళ వర్షం కురిసిందని అన్నారు. పాశ్చాత్య సంగీతానికి మోజు పడే రోజుల నుంచి శాస్త్రీయ సంగీతం వైపు పరుగులెడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సౌందర్య లహరి శీర్షికన సుమారు 300మంది విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. అష్టలక్ష్మీ అవతారాలను ప్రదర్శించి అద్భుత నృత్యరూపకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు డాక్టర్ పద్మాజారెడ్డి కుటుంబసభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నృత్య రూపకం
గురువారం రవీంద్ర భారతలో ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి సంస్థ ఏడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

నృత్య రూపకం
కుటుంబ సమేతంగా తిలకించే కళలు కేవలం భారతదేశానివేనని, అమెరికా లాంటి దేశాలు మన దేశ కళలను అనుసరిస్తున్నాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

నృత్య రూపకం
మంత్రి పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రవీంద్ర భారతిలో దేవతలు దిగివచ్చిన వేళ వర్షం కురిసిందని అన్నారు. పాశ్చాత్య సంగీతానికి మోజు పడే రోజుల నుంచి శాస్త్రీయ సంగీతం వైపు పరుగులెడుతుందని చెప్పారు.

నృత్య రూపకం
ఈ కార్యక్రమంలో సౌందర్య లహరి శీర్షికన సుమారు 300మంది విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు.

నృత్య రూపకం
పాశ్చాత్య సంగీతానికి మోజు పడే రోజుల నుంచి శాస్త్రీయ సంగీతం వైపు పరుగులెడుతుందని పోచారం శ్రీనివాస్ చెప్పారు.

నృత్య రూపకం
అష్టలక్ష్మీ అవతారాలను ప్రదర్శించి అద్భుత నృత్యరూపకాన్ని ఆవిష్కరించారు.

నృత్య రూపకం
కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు డాక్టర్ పద్మాజారెడ్డి కుటుంబసభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications