మహేష్ బాబు నిర్ణయాలు భేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన నిర్ణయాల పట్ల చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఈ విషయం ఆయనతో సన్నిహితంగా మెలిగేవారికే కాదు.. అభిమానులకు కూడా తెలుసు. పుష్ప సినిమా ముందుగా వెళ్లింది మహేష్ బాబు దగ్గరకే. ప్రిన్స్ ను చాలా కన్విన్సింగ్ గా సుకుమార్ స్క్రిప్ట్ వినిపించినా అభిమానుల అంచనాలను అందుకోలేదని, తనకు సెట్ అవదని చాలా ఆలోచించి చివరకు నో చెప్పారు. సినిమా విడులైన తర్వాత అది అల్లు అర్జున్ కు తప్ప ఇంకెవరికీ సూట్ కాదని రుజువైంది. ఆ పాత్రను బన్నీ అంతగా పోషించారు.
గతంలోనే మహేష్ ను కలిశాను: విడుదల పార్ట్ 1 ప్రీమియర్ షో ప్రెస్ మీట్ సందర్భంగా దర్శకుడు వెట్రిమారన్ ఒక వార్త చెప్పారు. గతంలో బన్నీతోపాటు మహేష్ బాబును కూడా కలిశాడు. ఇద్దరూ సినిమా చేస్తారనుకున్నప్పటికీ వెట్రిమారన్ స్టైల్ హీరోయిజాన్ని తెలుగులో చూడరనే ఆలోచనతోనో ఏదన్నాకానీ.. చివరకు అది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చినా.. మేకింగ్ పరంగా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ మన ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టమయ్యేది. జాతీయ అవార్డులు సాధించిన ఆడుకాలం, విసరనై డబ్బింగ్ లు తెలుగులో కనీస స్థాయిలో ఆడలేదు. ఇదే మంచి ఉదాహరణ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మహేష్ లాంటి స్టార్లను వెట్రిమారన్ డీల్ చేయలేరంటున్నారు.

సరైనవే అవుతున్నాయి: మహేష్ బాబు నిర్ణయాలు సరైనవే అవుతున్నాయని తేలుతోంది. కొన్ని కాంబినేషన్లు వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా మారితే చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. అందుకే అంతా మన మంచికే అనుకోవాలి. విడుదల సినిమా విడుదలైతే తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ తనను ఆదరిస్తారనే నమ్మకంతో వెట్రిమారన్ ఉన్నారు. నిర్భయంగా తెరపై నిజ జీవితంలోని వాస్తవాలను చూపించే వెట్రిమారన్ ఇక్కడి ప్రేక్షకులకు నచ్చుతారా? లేదా? అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.













Click it and Unblock the Notifications