దేవయాని అరెస్టుపై హైదరాబాద్‌లో నిరసన (ఫొటోలు)
హైదరాబాద్: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడే అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో గురువారం నిరసనలు వెల్లువెత్తాయి. వామపక్షాల కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని అమెరికా కాన్సులేట్ ముందు వారు ధర్నాలు చేశారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దేవయాని అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
తన సహాయకురాలి వీసా దరఖాస్తు విషయంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో అమెరికాలోని భారతీయ దౌత్య కార్యాలయంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న దేవయాని కోబ్రాగాడెను గురువారం అమెరికా అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రూ. 25 వేల అమెరికన్ డాలర్లు చెల్లించిన దేవయాని కస్టడీ నుంచి విడుదలయ్యారని మాన్ హట్టన్‌లోని అత్యున్నత ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీతి బరార్ శుక్రవారం వెల్లడించారు.
భారత దేశం నుంచి వ్యక్తిగత సహాయకురాలిని తీసుకువచ్చే క్రమంలో వీసా కోసం పలు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో దేవయానిని గురువారం ఉదయం లా ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రీత్ భరార్ గురువారం తెలిపారు.

ఎఐఎస్ఎఫ్ ధర్నా..
దేవయాని అరెస్టుకు నిరసనగా సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ కార్యకర్తలు ఇలా ప్రదర్శన నిర్వహించారు.

ధర్నా చేస్తున్న విద్యార్థులతో పోలీసులు..
దేవయాని అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా లేపేశారు.

విద్యార్థుల అరెస్టు..
దేవయాని అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో ఎక్కించారు.

వెల్లువెత్తిన నిరసన..
దేవయాని అరెస్టుకు నిరసనగా విద్యార్థులు పెద్ద యెత్తున ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెల్లుబుకిన ఆగ్రహం..
దేవయాని అరెస్టుకు నిరసనగా హైదరాబాదులోని నిరసన పెల్లుబుకింది. దేవయానిని కావాలనే ఇరికించి, భారతీయులను అమెరికా అవమానించిందని ఆందోళనకారులు ఆరోపించారు.

ఆందోళనకారుడిని ఎత్తుకెళ్తున్న పోలీసులు..
దేవయాని అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ కాన్సుల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన ఆందోళనకారులను పోలీసులు ఎత్తుకెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు.

విద్యార్థుల అరెస్టు..
దేవయాని అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో ఎక్కించారు.












Click it and Unblock the Notifications