మనం సమర్థిస్తున్నామా: మోడీకి పురంధేశ్వరి ఘాటు లేఖ, జగన్‌కు ఊరట
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాశారు.
అమరావతి: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాశారు.

చంద్రబాబు ప్రభుత్వంలో మనం కూడా
ఈ లేఖలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆమె లేఖలో టిడిపిని, చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. టిడిపి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, ఏపీ ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి.. మనం సమర్థించినట్లవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది
పార్టీ ఫిరాయింపులపై ప్రస్తుతం ఉన్న చట్టం అపహాస్యం అవుతోందని, కఠినమైన చట్టం తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పారు.

అపహాస్యం
తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందన్నారు. మనం ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి ఫిరాయింపులను ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. ఇది సరికాదన్నారు.

జగన్‌కు ఊరట
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సరికాదన్నారు. టిడిపి వైసిపి నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిందని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలొ తొక్కారన్నారు.
కాగా, పురంధేశ్వరి బీజేపీ ముఖ్యనేతలకు ఈ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పురంధేశ్వరి లేఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు మరింత ఊరట నిచ్చే అంశమేనని చెప్పవచ్చు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications