పుష్ప 2.. ఏపీలో పొలిటికల్ వైల్డ్ ఫైర్.. రాళ్ళు, కర్రలతో టీడీపీ వర్సెస్ వైసీపీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్ప 2 సినిమా రచ్చ చేస్తోంది. ఈరోజు పుష్ప 2 థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కొనసాగుతుంది. ఒకవైపు ఏపీలో పుష్ప 2 సినిమా పైన రాజకీయ దుమారం కూడా పీక్స్ కు చేరుకుంటుంది. పుష్ప 2 సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ ఫ్లెక్సీలను ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తుండగా, వాటితో పాటే జగన్ ఫ్లెక్సీలను, వైసీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.
అల్లు అర్జున్ కోసం వైసీపీ
అల్లు అర్జున్ కు తమ మద్దతును ప్రకటిస్తున్నారు వైసిపి నేతలు, కార్యకర్తలు. ఇక పుష్ప సినిమా సౌండ్ ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ ఇండియాలోనూ వినిపిస్తున్న వేళ ఏ థియేటర్లో చూసినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతుంది. పుష్ప 2 సినిమా సందడి వేళ తెలుగు రాష్ట్రాలలో ఫ్లెక్సీల హడావుడి కొనసాగుతుంది.

థియేటర్ వద్ద టీడీపీ వర్సెస్ వైసీపీ
ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమా థియేటర్ వద్ద టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా పాకాల లోని శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద పుష్ప 2 సినిమాకు సపోర్టుగా వైసిపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ తో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రాళ్ళు, కర్రలతో దాడి
ఇక మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ఆ ఫ్లెక్సీలలో రాసి పెట్టారు. అయితే వైసీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీల పైన టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలు, వేడి నీళ్లతో వైసిపి నేతలు దాడికి పాల్పడగా, టిడిపి నేతలు ప్రతి దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఏపీలో పొలిటికల్ వైల్డ్ ఫైర్
పోలీసులు వారిని అడ్డుకోవడానికి నానా చావు చావాల్సి వచ్చింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రాజకీయ వర్గాల మధ్య ప్రచ్ఛన్న సమరానికి కారణంగా మారింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అన్నట్టు ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ వైల్డ్ ఫైర్ లానే సాగుతుంది.












Click it and Unblock the Notifications