తప్పిన పెను ప్రమాదం: 14కి.మీలు వెనక్కి వెళ్లిన రైలింజన్‌, ఏం జరిగిందంటే..?

Subscribe to Oneindia Telugu

అనంతపురం: గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో బుధవారం ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వాడి రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉన్న ఓ విద్యుత్‌ రైలింజన్‌ దానంతట అదే రైలు పట్టాలపై 14 కిలోమీటర్లు వెనుకకు వెళ్లింది.

 Rail engine went back 14 KM

చెన్నై నుంచి ముంబైకి బయల్దేరిన మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు గుంతకల్లులో విద్యుత్‌ లోకోను అనుసంధానం చేసి పంపారు. వాడి నుంచి ముంబై వెళ్లేందుకు విద్యుదీకరణ చాలినంత లేకపోవడంతో రైలుకు చెందిన విద్యుత్‌ లోకోను తొలగించి డీజిల్‌ లోకోను అనుసంధానించారు.

అయితే, ఈ సమయంలో సాంకేతిక లోపం కారణంగా వాడి స్టేషన్‌లో నిలిపి ఉన్న విద్యుత్‌లోకో నాల్వార్‌ రైల్వేస్టేషన్‌ వరకు పరుగుతీసింది. ఆ సమయంలో అదే లైనులో మరే రైళ్లు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను అందజేయాలని డీఆర్‌ఎమ్‌ విజయప్రతాప్‌ సింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Rail engine went back 14 K.M in Guntakal, in Anantapur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి