విశాఖ- తిరుపతి వందేభారత్ సిద్దం: హాల్టింగ్ స్టేషన్లు, టైమింగ్స్..!!

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రైల్వే శాఖకు ఏపీ సీఎం నుంచి పలువురు ఎంపీల ప్రతిపాదనల మేరకు తిరుపతికి మరో వందేభారత్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ పట్టాలెక్కించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. విశాఖ నుంచి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందేభారత్ రూట్ తో పాటుగా టైమింగ్స్ పైన దాదాపు నిర్ణయానికి వచ్చారు. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ ఖరారైంది. ప్రస్తుతం విశాఖ నుంచి నాలుగు వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు మరొకటి వెళుతున్నాయి. తిరుపతి, బెంగళూరు నగరాలకు కూడా విశాఖ నుంచి వందేభారత్‌ రైళ్లు నడపాలని సీఎం చంద్రబాబుతో సహా పలువురు ఎంపీలు రైల్వే మంత్రిని కోరారు. కొద్ది రోజులుగా విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ కేటాయింపు పైన చర్చలు జరి గాయి. ఈ రైలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో డే టైమింగ్స్ లో విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు రాత్రి వేళల్లో వందేభారత్ స్లీపర్ ప్రకటన దిశగా కసరత్తు కొనసాగుతోంది.

 అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
railways-all-set-to-launch-visakhapatnam-tirupati-vande-bharat-express-almost-finalises-schedule

రైల్వే శాఖ తుది కసరత్తు

కాగా, తాజాగా విశాఖ నుంచి తిరుపతి వందేభారత్ రైలు హాల్టింగ్ స్టేషన్లతో పాటుగా టైమింగ్స్ దాదాపు ఖరారు చేసారు. విశాఖ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ల లో హాల్టింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాగా.. ఈ రైలు సూత్రప్రాయంగా నిర్ణయించిన వేళల మేరకు ఉదయం 5.35 గంటలకు విశాఖలో బయల్దేరి 7 గంటలకు సామర్లకోట, 7.40 గంటలకు రాజమండ్రి, 9.30 గంటలకు విజయవాడ, 10.55 గంటలకు ఒంగోలు, 12.15 గంటలకు నెల్లూరు మీదుగా మధ్యాహ్నం 2.10 గంటలకు తిరుపతి చేరుతుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి సాయంత్రం 4.48 గంటలకు నెల్లూరు, 6.08 గంటలకు ఒంగోలు, రాత్రి 7.25 గంటలకు విజయవాడ, 9.23 గంటలకు రాజమండ్రి, 10.03 గంటలకు సామర్లకోట మీదుగా రాత్రి 11.30 గంటలకు తిరుపతి చేరే విధంగా ప్లాన్ చేసారు. అయితే, ఈ షెడ్యూల్ పైన మరోసారి అధ్యయనం చేసి అధికారికంగా ఖరారు చేస్తారని సమాచారం. ఈ రైలు పైన రైల్వే శాఖ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+