Chandrababu: జైలు నుంచి చంద్రబాబు లేఖ నిజం కాదా?: అధికారుల ట్విస్ట్
విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు రాసినట్లుగా వైరల్ అవుతున్న ఈ లేఖపై రాజమండ్రి జైలు అధికారులు క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..
'తెలుగు ప్రజలకు జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ. నేను జైలులో లేను....ప్రజల హృదయాల్లో ఉన్నాను. ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వరలో బయటకొస్తాను. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. అందరికీ దసరా శుభాకాంక్షలు' అని చంద్రబాబు పేరిట ఓ లేఖను టీడీపీ, ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు వైరల్ చేశారు. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు స్పందించారు.

'చంద్రబాబు సంతకంతో, స్నేహ బ్లాక్, రాజమహేంద్రవరం జైలు పేరున సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ అవుతున్న కరపత్రం గురించి తెలియజేయునది ఏమనగా, సదరు కరపత్రము కారాగారము నుంచి జారీ చేయబడినది కాదు. కారాగార నియమావళి ప్రకారం.. ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన కరపత్రములు బయటకు విడుదల చేయదలచినచో, సదరు పత్రమును జైలు అధికారులు పూర్తిగా పరిశీలించి సదరు పత్రముపై జైలరు ధృవీకరించి, సంతకం, కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు, కుటుంబసభ్యులకు పంపబడును. కావున పైన చూపబడిన కరపత్రమునకు, ఈ కారాగారమునకు ఏ విధమైన సంబంధము లేదని తెలియపరచుచున్నాము' అని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారము పర్యవేక్షణాధికారి స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు సంతకంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న కరపత్రం జైలు నుంచి వెలువడినది కాదు
— Jagan Army® (@JaganArmy) October 22, 2023
- జైలు అధికారుల వివరణ #CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #KhaidiNo7691#EndOfChandrababu #EndOfTDP pic.twitter.com/tSyqbLPSBs
కాగా, ములాఖత్‌లో భాగంగా తనను కలిసిన కుటుంబసభ్యులకు తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను రాసిన లేఖని చంద్రబాబు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లేఖలో ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నానని... విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications