మెషిన్ గన్ తో దడదడలాడిస్తున్న తలైవా!

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు రుచి చూపించారు. జైలర్ సినిమాతో నెవర్ బిఫోర్ అనేలా కంబ్యాక్ ఇచ్చారు. చిరంజీవి, కమలహాసన్ లాంటి స్టార్ హీరోల కంబ్యాక్ చూశాంకానీ ఈ రేంజ్ కంబ్యాక్ ను ఇండియాలో ఏ సినీ పరిశ్రమ చూసివుండదు. కేవలం రెండున్నర రోజుల్లోనే జైలర్ బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. మూడురోజుల్లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

సోమవారం ఒక్కరోజును మినహాయిస్తే వెంటనే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సెలవు ఉంది. ఆరోజు కూడా రజనీ బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి రికార్డులు క్రియేట్ చేయనున్నాడో అనే ఉత్కంఠతో ఇతర హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి 10 రోజుల క్రితం వరకు కూడా జైలర్ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనా లు లేవు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనులు మొదలుబెట్టండ్రా బాబూ అంటూ సోషల్ మీడియాలో తలైవర్ అభిమానులు నిర్మాతలను ఆడుకున్నారు.

rajinikanth jailer movie collections details

విడుదల తేదీ దగ్గర పడే సమయానికి రజనీకాంత్ ప్రసంగం, ట్రైలర్, హుకుం సాంగ్ ఈ సినిమాకు ఎక్కడలేని బజ్ ను తీసుకొచ్చాయి. కబాలి సినిమా తర్వాత ఆ స్థాయిలో ఓపెనింగ్స్ ను జైలర్ రాబడుతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ అనేది ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపించిందని అర్థమవుతోంది. మున్ముందు ఇంకెన్ని కలెక్షన్లు వసూలు చేయనుందో అంటూ ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. మొదటివారం పూర్తయ్యే సమయానికి జైలర్ సినిమా రూ.500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+