పవన్ కళ్యాణ్‌కు హ్యాండిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్!
'కెరటం' సినిమాతో రకుల్ తెలుగుతెరకు పరిచయమైంది. తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటించింది. 'లౌక్యం', 'నాన్నకు ప్రేమతో', 'ధృవ' వంటి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో ఈ భామకు అవకాశాలు రావడంలేదు.
కొంతకాలం క్రితం తెలుగులో ఎడాపెడా సినిమాలు చేసింది. అవన్నీ ప్లాపవడంతోపాటు ఎవరినీ అలరించలేకపోయాయి. దీంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా పవన్ కల్యాణ్ సినిమా బ్రో లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ అంతా రెడీ అన్న తర్వాత చివరి నిముషంలో డేట్స్ లేవంటూ షాక్ ఇచ్చిందనే వార్త వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ తో సముద్రఖని డైరెక్షన్ లో 'బ్రో' అనే సినిమా చేస్తున్నారు. ఇది దాదాపుగా పూర్తి కావస్తోంది. టాకీ పూర్తి అయ్యింది. మరో రెండు పాటలను చిత్రీకరిస్తే మొత్తం షూటింగ్ అయిపోతుంది. ఈ రెండు పాటల్లో ఒక పాటను స్పెషల్ సాంగ్ గా తీయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇద్దరు హీరోలమీద ఈ పాట ఉంటుంది.
ఈ పాటలో డాన్స్ చేసేందుకు తమన్నా, శృతిహాసన్, శ్రీలీల.. ఇలా చాలాపేర్లను పరిశీలించారు. చివరకు రకుల్ ప్రీత్ సింగ్ బాగుంటుందని ఆమెను ఫైనల్ చేశారు.ఆమె ఓకే అనడంతో.. షూటింగ్ కు సర్వం సిద్ధం చేశారు. పాటను చిత్రీకరించడానికి సరిగ్గా రెండురోజుల ముందు డేట్లు లేవంటూ చెప్పి దర్శక నిర్మాతలకు షాకిచ్చింది. దీంతో మరో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జులై 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. షూట్‌కు రెండు రోజుల ముందు రకుల్ తనకు డేట్‌లు అడ్జస్ట్ కావడం లేదని షాక్ ఇచ్చిందట. దీంతో ఇక మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డారట టీమ్.












Click it and Unblock the Notifications