జనసేనకు జై కొట్టిన రామ్ చరణ్ ..బాబాయ్ పార్టీకి మద్దతుగా ప్రజల్లోకి (వీడియో)
2024 ఎన్నికలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చాలా కీలకమనే చెప్పాలి. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో తనని తాను నిరూపించుకోలేక పోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలిచి పవన్ కల్యాణ్ .. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూశారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్.. తన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోలేక పోయారు.
ఈ క్రమంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు పవన్ కనిపిస్తున్నారు. మళ్లీ టీడీపీ, బీజేపీలతో జతకట్టిన పవన్ కల్యాణ్.. జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన తన సీఎం సీటును సైతం త్యాగం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయాలు వేరు , సినిమాలు వేరని భావించే పవన్ కల్యాణ్ ..కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా తన రాజకీయంలో వినియోగించుకోవాలని భావించలేదు. మెగా హీరోలకు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది.

ఇండస్ట్రీలో అల్లు అర్జున్ , రామ్ చరణ్ టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. పవన్ కల్యాణ్ కోరాలే కానీ వీరంతా జనసేన తరుఫున ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ వారి సాయం ఎప్పుడు కోరింది లేదు. అయితే బయట నుంచి వీరు జనసేనకు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనసేనకు జై కొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు.
జై జనసేన అంటున్న రామ్ చరణ్ ..!!#RamCharan #RC16 #PawanKalyan #JANASENA #Oneindiatelugu pic.twitter.com/ImuzNqk1t1
— oneindiatelugu (@oneindiatelugu) March 19, 2024
ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా వైజాగ్‌కు వెళ్లిన రామ్ చరణ్‌కు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో కొందరు జై పవన్ కల్యాణ్, జై జనసేన అంటూ రామ్ చరణ్ ముందు నినాదాలు చేశారు. రామ్ చరణ్ సైతం జై జనసేన అంటూ వారితో గొంతు కలిపారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మెగా హీరోలు జనసేన తరుఫున ప్రచారం నిర్వహించడానికి రెడీ అవుతున్నారనే సమాచారం అందుతుంది. జనసేన పార్టీ తరుఫున పని చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా ఉందని నిహారిక ప్రకటించింది.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications