బ్రాహ్మణికి రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన అయాచిత సలహా ఏమిటంటే..?!

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలనూ తలపెట్టింది. కొవ్వొత్తుల ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శనలు, పోస్ట్ కార్డుల ఉద్యమాలతో చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Nara Brahmani

ఇందులో భాగంగా- మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తూ ఈ సాయంత్రం రాత్రి 7 నుంచి 7:05 నిమిషాల వరకు ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గంటలు మోగించాలని నారా బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టాలని సూచించారు. విజిల్స్ వేస్తూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు.

ఆ సమయంలో ఎవరైనా ద్విచక్రవాహనం లేదా కారులో ప్రయాణిస్తూ ఉంటే గట్టిగా హారన్ కొట్టాలని నారా బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి నిరసన తెలపాలని సూచిస్తూ ఓ ట్వీట్ చేశారామె. ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు దీనికి రిప్లై ఇస్తోన్నారు.

Ram Gopal Varma

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనికి రిప్లై పోస్ట్ చేశారు. నారా బ్రాహ్మణికి ఓ సలహా ఇచ్చారు. బ్రాహ్మణి గారూ..మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త. మీకు నేనిచ్చే చిన్న సలహా ఏమిటంటే..ప్రజలపై తాను ఎంత వరకు ప్రభావం చూపగలను అనే అంశాన్ని పరీక్షించుకోవడానికి ఇలాంటి ప్రమాదకర ప్రయత్నాలు చేయవద్దు.. అని సూచించారు.

మోత మోగించాలనే సూచనలను ప్రజలు ఎవరూ పాటించకపోతే, పట్టించుకోకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్‌కు గురవుతుంది.. అంటూ సూచించారు రామ్ గోపాల్ వర్మ. వర్ధమాన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రపోజల్స్ సరి కావనే అభిప్రాయాన్ని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సలహాదారుల మాట అస్సలు వినొద్దంటూ నోట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+