'మీరే అంతమవుతారు, మొరగడం ఆపండి, పెట్రోలు లేకుండా తగలబెడతా'
'వంగవీటి' సినిమా పైన రామ్ గోపాల్ వర్మ - వంగవీటి రాధాకృష్ణ, రంగా అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సోమవారం నాడు వంగవీటి రంగా, రాధా మిత్రమండలి వర్మ మాటల పైన స్పందించింది.
విజయవాడ: 'వంగవీటి' సినిమా పైన రామ్ గోపాల్ వర్మ - వంగవీటి రాధాకృష్ణ, రంగా అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సోమవారం నాడు వంగవీటి రంగా, రాధా మిత్రమండలి వర్మ మాటల పైన స్పందించింది.
రామ్ గోపాల్ వర్మ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని చెప్పారు. దమ్ముంటే వర్మ బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బెజవాడలో ప్రతి పేద కుటుంబంతో వంగవీటి మోహన రంగకు అనుబంధం ఉందని చెప్పారు.

నా అంతు చూసేలోపు మీరే అంతమవుతారు: వర్మ కౌంటర్
తనకు హెచ్చరికలు, సవాళ్లు విసిరిన రాధారంగా మిత్రమండలికి దర్శకులు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా మండిపడ్డారు. నా అంతు చూస్తానని చెబుతున్నారని, నా అంతు చూసే లోపు మీరే అంతమవుతారని తీవ్రంగా మండిపడ్డారు.
మీరు మొరగటం ఆపకపోతే మీరేమిటో ప్రజలకు తెలిసిపోతుందన్నారు. పని పాటా లేకుంటా మురికివాడల్లో తిరిగే మీలాంటి వారు వంగవీటి రంగా, వంగవీటి రాధాకృష్ణ పేరు చెడగొట్టేందుకే పుట్టారన్నారు.
మీలాంటి వాళ్లు నా దిష్టిబొమ్మలు తగలబెట్టవచ్చు కానీ మీలోని కుళ్లును పెట్రోలు లేకుండా తగలబెడతానని అన్నారు. నేను క్షమాపణలు చెప్పడం అటుంచి, మీరు మొరగటం ఆపేయాలన్నారు. ఇప్పటికైనా బుద్ధిలేని మీ బుర్రల్లోకి బుద్ధిని ఎక్కించుకోండన్నారు. అలాగే, వంగవీటి రాధా బెదిరింపులకు భయపడేది లేదని, ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదని వర్మ అన్నారు.
-
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్!












Click it and Unblock the Notifications