రామ్ చరణ్ - ఉపాసన ఆస్తి విలువ
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. 2012 లో వీరి వివాహం జరగగా.. చాలా కాలం తరువాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆడపిల్ల రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంలోనే వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఉపాసనకు ఒక ప్రత్యేక స్థానముంది.
ఇన్ స్టాగ్రామ్ పోస్టుతో ఎక్కువ మంది అభిమానులను ఉపాసన సంపాదించుకుంది. అపోలో ఆస్పత్రి పనులతోపాటు తన సొంత వ్యాపారాల్లో కూడా బిజీ గా ఉంటుంది. వీరిద్దరి ఆస్తి విలువ రూ.2500 కోట్లపైనే ఉంటుంది. ఇందులో ఉపాసన వాటా రూ.1130 కోట్లుగా ఉంది. అపోలో హాస్పటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనవరాలే ఉపాసన. ఆయన నికర ఆస్తుల విలువ రూ.21వేల కోట్లకు పైనే ఉంటుంది. భారత్ లో ఉన్న టాప్-100 రిచెస్ట్ పర్సన్ లో ఆయన కూడా ఒకరు.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రుల మార్కెట్ విలువ రూ.70 వేల కోట్లుగా ఉంది. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఉపాసన విదేశాల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ తీసుకున్నారు. చదువు పూర్తి అయిన వెంటనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బి పాజిటివ్ అనే మ్యాగజైన్ ఇన్ చార్జిగా ఉపాసన ఉన్నారు. ఇంత సంపాదన ఉన్న ఉపాసన చాలా నిరాడంబరంగా ఉండటంతోపాటు బంధాలకు విలువనిస్తారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ అంటే విపరీతమైన గౌరవం, మర్యాద. ఉపాసన ప్రవర్తన చూసి మెగా అభిమానులు పొంగిపోతుంటారు.












Click it and Unblock the Notifications