జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన రాంపూర్ కోర్టు
లక్నో: ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada)పై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది.
జయప్రదపై ఈ ఉల్లంఘన కేసు 2019లోనే స్వార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థాన ధర్మాసనం ఆదేశించినా ఆమె హాజరుకాలేదు. దీంతో జయప్రదపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన జయప్రద సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు.

ఇది ఇలావుండగా, జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు ఇటీవల(ఆగస్టు నెలలో) తీర్పు వెలురించింది. ఆమెతోపాటు మరో ముగ్గురికి ఈ శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. అంతేగాక, రూ. 5000 చొప్పున ఒక్కొక్కరికి జరిమానా విధించింది. చెన్నైలోని రాయపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ నిర్వహించారు జయప్రద. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి థియేటర్ పనులు చూసుకునేవారు. మొదట బాగా లాభాలు వచ్చినా.. తర్వాత రాబడి తగ్గడంతో చివరకు థియేటర్ మూసేశారు.
అయితే, ఆ సమయంలో కార్మికుల నుంచి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. థియేటర్ మూసివేయడంతో తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. వాటిని కార్మికులకు అందజేయలేదు. దీంతో కార్మికులందరూ బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో సదరు బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది.
కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని కోర్టుకు తెలిపింది. దీన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో జయప్రద తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టివేసింది. అయితే, ఆమె వాటిని కార్మికులకు తిరిగి అందిస్తామని చెప్పినా కోర్టు అంగీకరించలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ కోర్టు జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications