ఆడబిడ్డగా రేణుకా చౌదరి నిరూపించుకోవాలి: రాంరెడ్డి
ఖమ్మం: కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుందో నిరూపించుకోవాలని, ఆమె తెలంగాణ ఆడబిడ్డగా సర్టిఫికేట్ తెచ్చుకోవాలని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు. ఆయన ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు.
ఆడబిడ్డల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ నెల 21న ఖమ్మంలో జరిగే సమావేశానికి రేణుకను ఆహ్వానించే విషయంలో తెలంగాణ ప్రాంత మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఆడబిడ్డ అనే పదానికి ఎంతో గౌరవముందని, రేణుకా చౌదరి ఖమ్మం ఆడబిడ్డ అయితే నిరూపించుకోవాలన్నారు.

సమైక్యాంధ్రనే: భూమన
తమ పార్టీ ఎప్పుడు రాష్ట్రాన్ని విభజించాలని చెప్పలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. తాము అప్పుడు, ఇప్పుడు సమైక్యాంధ్రనే అంటున్నామన్నారు. విభజన విషయంలో ఓ తండ్రిలా సమస్యకు పరిష్కారం చూపించాలని మాత్రమే కోరామన్నారు.
విద్యుత్ ఐకాసతో కిరణ్ చర్చలు
విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో తిరిగి రాత్రి ఏడు గంటలకు చర్చించాలని నిర్ణయించుకున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications