పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
ఏదైనా ఆహారం రుచిని ఉల్లిపాయ పెంచుతుంది. అంతేకాదు.. ఆరోగ్యానికి పలువిధాలుగా మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. పచ్చి ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. రోజువారీ ఆహారంలో చేర్చుకుని సలాడ్‌గా తీసుకుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయల్లో కొన్ని రసాయనాలుంటాయి. క్వెర్సెటిన్ అనే రసాయనం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి ఉల్లిపాయలలో సేంద్రీయ సల్ఫర్ కంటెంట్ కనిపిస్తుంది. దాని రుచి, వాసన ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సేంద్రీయ సల్ఫర్ ఉపయోగపడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని విచ్ఛిన్నం చేయడంతోపాటు గుండె జబ్బులు , గుండె స్ట్రోక్‌లను నిరోధిస్తుంది.

పచ్చి ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్ , ఆర్గానిక్ సల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి పని చేస్తాయి. మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవాలి. శరీరానికి అవసరమైన పొటాషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ సి, విటమిన్ 6 ఉల్లిపాయల్లో పుష్కలంగా లభిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి , అల్జీమర్స్, నరాల సంబంధిత సమస్యలను ఇవి దూరం చేస్తాయి.

వీటిని ఎక్కువగా తిన్నా నష్టాలున్నాయి. శరీరంలో దుర్వాసన రావడంతోపాటు సల్ఫర్ ను విచ్ఛిన్నం చేయడంవల్ల చెమట పెరుగుతుంటుంది. శరీరం దుర్వాసనకు ఇదే కారణమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను కలిగి ఉంటాయి. ఇది ఎలాంటి వాపునైనా తగ్గిస్తుంది. శరీరంలో అలెర్జీ సమస్యను తగ్గిస్తుంది












Click it and Unblock the Notifications