రాయచోటిలో వైసీపీ కార్యాలయానికి నిప్పు, వాహనాలు దగ్ధం - ఉద్రిక్తత..!!
స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు నుంచి మున్సిపల్ ఎన్నికల కు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజునే పలు ప్రాంతాల్లో వైసీపీ- టీడీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పుంగనూరులో రెండు పార్టీల మధ్య రాళ్లు... కర్రల దాడులు జరిగాయి. ఇక, రాయచోటిలో వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టటం తో దాదాపు పది వాహనాలు దగ్దం అయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 15 కార్లు ధ్వంసమయ్యాయి. నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వైసీపీ కార్యాలయం వద్ద కూడా వాహనాలకు నిప్పు పెట్టారు. దాడి సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు.
దీంతో.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో వైపు పుంగనూరులోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మిథున్ రెడ్డి తమ పార్టీ అభ్యర్ధుల నామినేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన సమయంలో రెండు పార్టీల శ్రేణులు దాడులకు దిగాయి. రాళ్లు, కర్ర లతో దాడులు చేసుకున్నాయి. పలువురు గాయపడ్డారు.
ఈ దాడుల్లో ఎంపీ మిథున్ రెడ్డి స్వల్ప గాయాలయినట్లు చెబుతున్నారు. ఆయన గన్ మెన్ తలకు గాయమైంది. అయితే, దాడులు తమ పైనే జరిగాయని రెండు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. రిటర్నింగ్ అధికారుల తీరు పైన ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నామినేషన్లు తీసుకోవటం పైన ప్రశ్నించారు.
దీంతో.. వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఆన్ లైన్ లో నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని కోరింది. టీడీపీ తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. టీడీపీ కార్యకర్తల దాడి సమయంలో పోలీసులు నామినేషన్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డ గంటకు పైగా ఉంచాల్సి వచ్చింది. పోలీసు బలగాలు రెండు పార్టీల శ్రేణులను చెదరగొట్టారు.













Click it and Unblock the Notifications
