పవన్‌‌కు నచ్చిందేమో: జగ్గారెడ్డి, పెళ్లిళ్లపై మళ్లీ విహెచ్

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై వివిధ పార్టీల నాయకులు ప్రతిస్పందించారు. గ్లామర్‌తో పవన్ కళ్యాణ్ పెడుతున్న పార్టీ కాంగ్రెస్, బిజెపిలకు మేలు చేసేందుకేనని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. విధి విధానాలు ప్రకటించాకే జనసేన పార్టీ భవిష్యత్‌పై మాట్లాడతానని ఆయన అన్నారు.

తిరుపతిలో టిటిడి కార్మికుల సమస్యలపై సీఐటియూ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన ఈ విధంగా స్పందించారు. కమ్యూనిజం భావాలు ఉన్నంత మాత్రాన ప్రజా సంక్షేమ దృక్ఫథం లేకపోతే పవన్ పార్టీకి రాజకీయ మనుగడ ఉండదన్నారు.

Reactions on Pawan Kalyan comments

జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా జగ్గారెడ్డిపై పవన్ ప్రశంసలకు ఆయన స్పందించారు. తానెప్పుడూ పవన్‌కల్యాణ్‌ను కలవలేదని, స్థిరమైన తన వైఖరి పవన్ కళ్యాణ్‌కు నచ్చి ఉంటుందేమోనని జగ్గారెడ్డి అన్నారు. అయితే కాంగ్రెస్ తప్పు చేసిందని పవన్ కళ్యాణ్ అనడం సరికాదన్నారు. అన్నీ పార్టీలు విభజించమన్న తర్వాతనే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. తాను జనసేన పార్టీలో చేరడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాజకీయ నాయకుడు కాకపోతే పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తాను ప్రశ్నించే వాడిని కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు చెప్పారు. శుక్రవారం తాండూరు సిండికేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకుడికి, పార్టీని నడిపించేవాడికి పారదర్శకత ఉండాలని అందుకే పవన్ మూడు పెళ్లిళ్ళపై తాను ప్రశ్నిస్తున్నానని పవన్ దానిపై ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

రాహుల్ పెళ్లిపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. రాహుల్‌కు ఇంకా పెళ్లి చేసుకునే వయసు ఉందని, ఆయన పెళ్లి గురించి మా ట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. రాజకీయ నాయకుడిగా తనను అభిమానిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారని హీరోగా పవన్‌ను తానూ అభిమానిస్తున్నానని విహెచ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+