కర్నూలు బస్సు ప్రమాదంలో బాధితులను ఆదుకున్న రియల్ హీరోలు వీళ్లే ..!
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై అగ్నిప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయపడ్డారని సమాచారం. స్వల్ప గాయాలతో 12 మంది బయటపడగా వీరిని కర్నూలు సర్వజన ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితులను ఆదుకున్న రియల్ హీరోలు వీళ్లే..
ప్రమాద సమయంలో అటుగా వెళ్లిన ఓ మహిళ వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు హైమా రెడ్డి వీడియో ద్వారా వివరించారు. ఆమె మాట్లాడుతూ.. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఈ ప్రమాదాన్ని చూశానని తెలిపారు. బస్సు మంటల్లో కాలిపోతుండగా.. కొందరు బయటకు దూకారు. సీట్లలో మానవ ముద్దలు, అస్థిపంజరాలు కనిపించాయని.. అది చూసి తట్టుకోలేకపోయానని వాపోయారు. అలానే ఆ రూట్‌లో వెళ్లిన ఓ వ్యక్తి కారులో ఆరుగురు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పగించి వెళ్లిపోయారు. వీరిద్దరూ చూపిన చొరవ పట్ల ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ప్రమాదానికి కారణం..
బస్సు రాత్రి 10 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున 2:14కి తెలంగాణ సరిహద్దులోని పులూరు టోల్ ప్లాజా చేరింది. 3:30 ప్రాంతంలో కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఒక బైక్‌ను బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సు బైక్‌ను దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది, దీంతో ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణం కోల్పోయాడు. మృతుడిని కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ గా గుర్తించారు.
ప్రాంతీయ అధికారులు, పోలీసులు, మరియు స్థానిక సంఘాలు బాధిత కుటుంబాలకు సత్వర ఆర్థిక, వైద్య సహాయం అందిస్తున్నారు. మృతుల కుటుంబాల కోసం ప్రత్యేక నివేదికలు, సాయం ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నారు.
మృతుల కుటుంబాలు ఆవేదన..
ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఘటనా స్థలికి చేరిన బంధువులు గొల్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందినట్లు ధృవీకరించారు. వీరి కుటుంబం అత్యంత కష్టంలో ఉందని స్థానికులు తెలిపారు.
బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి వీడియో ద్వారా వివరించిన ప్రత్యక్ష సాక్షి హైమా రెడ్డి #HymaReddy #KaveriTravles #Kurnool #ChinnaTekuru #FireAccident #KaveriTravelsBus #NewsUpdate #Oneindiatelugu pic.twitter.com/jsrv2ezevY
— oneindiatelugu (@oneindiatelugu) October 24, 2025












Click it and Unblock the Notifications