పవన్ కళ్యాణ్ ఇలాకాలో రికార్డింగ్ డ్యాన్స్..అమ్మాయిలతో బూతు స్టెప్పులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్స్‌లు నిర్వహించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో చోటుచేసుకుంది.ఆ గ్రామంలో పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
అర్థరాత్రి 12 గంటల తర్వాత రికార్డింగ్ డాన్స్ కోసం అమ్మాయిలను పిలిపించినట్టు సమాచారం. దాదాపు 12 మంది అమ్మాయిలతో అశ్లీలంగా డ్యాన్స్‌లు వేయించినట్టు తెలుస్తోంది. యువతులు రెచ్చిపోయి అశ్లీల భంగిమలను చూపిస్తూ నృత్యం చేస్తుంటే యువత పిచ్చెక్కిపోతూ ఈలలు వేస్తూ గోలగోల చేశారు.

ముఖ్యంగా 18 ఏళ్లు నిండని వారు కూడా ఈ రికార్డింగ్ డాన్స్ కార్యక్రమంలో పాల్గొనట్టు స్పష్టం అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో రికార్డింగ్ డాన్స్‌కు అనుమతి లేదు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఈ రికార్డింగ్ డాన్స్‌కు అనుమతి తీసుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
పిఠాపురంలో జోరుగా రికార్డింగ్ డాన్సులు.!#PawanKalyan #RecordDance #Pithapuram #AndhraPradesh #OITelugu pic.twitter.com/1Vkf86CghZ
— oneindiatelugu (@oneindiatelugu) March 27, 2025
ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన రికార్డింగ్ డాన్స్ వెనుక కూటమి నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయి ఉండి కూడా...ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని వైసీపీ నేతలు అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డ్యాన్స్‌పై కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications