Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అశ్లీలంగా చిందులు

కాకినాడా: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి చెంత అపచారం జరిగింది. సత్యదేవుని సన్నిధిలో రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగాయి. అమ్మాయిలు అర్థనగ్నంగా నృత్యాలు చేశారు. యువతులతో కలిసి మగాళ్లు చిందులేశారు.

దేవాలయంలోని హరిహర సదన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో మహిళా డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వివాహానికి స్థానిక టిడిపి సర్పంచ్ హరిబాబు, మండల అధ్యక్షుడు యడ్ల బేతాళుడు తదితరులు హాజరయ్యారు. ఈ తతంగాన్ని పోలీసులు, అధికారులు చూస్తూ ఉండిపోయారు.

Recording dances at Annavaram Satyanarayana Swami temple

సినిమా పాటలకు స్టెప్పులేశారు. అమ్మాయిలతో కలిసి పురుషులు నృత్యాలు చేశారు. మగాళ్లు పీకల దాకా తాగి ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలేమిటని ప్రశ్నించారు.

అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆలయం ఈవో చెప్పారు .తెల్లవారు జామున 3 గంటలకు జరగడంతో ఆ నృత్యాల విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించి ఘటనపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+