Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yatra 2 release date: అచ్చొచ్చిన ఆ తేదీ నాడే విడుదల

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న మూవీ.. యాత్ర 2 (Yatra 2). మహీ వీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్‌గా చెప్పుకోవచ్చు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ యాత్ర అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది.

వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించారు. రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో అనసూయ.. కీలక పాత్రల్లో నటించారు. 2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదలైన ఈ సినిమా అప్పట్లో పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.

Release date of Yatra 2 movie is out

పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌కు ఎదురైన అనుభవాలే ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఆ అనుభవాల ఆధారంగానే ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, వ్యవసాయ విద్యుత్ ఛార్జీల మాఫీ, పింఛన్ మొత్తం పెంపుదల, డ్వాక్రా మహిళలకు పావల వడ్డీతో రుణాల విడుదల.. వంటి చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకాలకు బీజాలు వేశాయి.

ఇప్పుడా సినిమాకు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉందా మూవీ. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తోన్నారు. ఇందులో కూడా వైఎస్సార్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తోన్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

తాజాగా యాత్ర 2 విడుదల తేదీని ప్రకటించారు దర్శకుడు మహీ వీ రాఘవ్. దీనికి సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 2019లో యాత్ర ఏ తేదీన విడుదలైందో.. 2024లో అదే తేదీ నాడే యాత్ర 2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

Release date of Yatra 2 movie is out

2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదల కాగా.. 2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. యాత్ర తరహాలోనే ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల కావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎంతో కొంత దోహదపడిందని చెబుతుంటారు. ఇప్పుడు 2024లో అదే తేదీకి యాత్ర 2 కూడా తెరమీదికి రాబోతోండటం- ఆ తరువాత జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడానికి సహాయ పడుతుందనే అంచనాలు సైతం లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+