మొట్టమొదటిసారి యువత కోసం రోజా జాబ్ మేళా, ఆధార్ కార్డ్‌తో రావాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

పుత్తూరు: నవంబర్ 17న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజు. తన బర్త్ డే రోజు రోజా మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.

టీడీపీకి వరుస షాక్‌లు: రేవంత్‌కు రివర్స్, కేసీఆర్ బలం పెంచిన కాంగ్రెస్ నేత!

  జగన్ పాదయాత్ర గందరగోళం : రోజా ఉన్నచోట ఉండవు గా ! Jagan fired on MLA Roja | Oneindia Telugu

  రోజా నిర్వహించనున్న ఈ ఉద్యోగ మేళాకు దాదాపు 40 కంపెనీలు హాజరవుతున్నాయి. ఈ నెల 17వ తేదీన పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ మేళా జరగనుంది.

  మెగా జాబ్ మేళా

  మెగా జాబ్ మేళా

  ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మెగా జాబ్ మేళా కొనసాగుతుంది. ఉద్యోగార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోజా, వైసీపీ నాయకులు కోరుతున్నారు.

  ఆధార్ కార్డ్ తప్పనిసరి

  ఆధార్ కార్డ్ తప్పనిసరి

  ఉద్యోగం కోసం వచ్చే వారంతా తమ వెంట తమ ఆధార్ కార్డులు తెచ్చుకోవాలని కూడా చెప్పారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు జాబ్ మేళాకు హాజరు కావొచ్చు.

  హలో యూత్, చలో జాబ్

  హలో యూత్, చలో జాబ్

  మెగా జాబ్ ఫెయిర్‌ను రోజా చారిటబుల్ ట్రస్ట్, నగరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రోజా ఇప్పటికే 'హలో యూత్ చలో జాబ్' మెగా ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.

  రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటిసారి

  రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటిసారి

  రోజా తన పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటిసారి ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నారు. కాగా, రోజా 2014 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mega Job Mela under YSR Congress Party leader and Nagari MLA Roja Charitable trust on November 17.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి