బాబుకు అదే భయం: జగన్ కోసం రోజా పూజలు, ‘టీడీపీది వేధింపుల సర్కారే’

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్రను తలచుకుంటేనే టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు భయపడిపోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నవంబర్ 6 నుంచి దాదాపు ఆరు నెలలపాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే.

  అసెంబ్లీలో టిడిపి వ్యూహం : వైసీపీ నేతల గురించి మాట్లాడకూడదని ఇలా...! | Oneindia Telugu
   జగన్ కోసం పూజలు..

  జగన్ కోసం పూజలు..

  ఇడుపులపాయ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో జగన్ తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని అప్పలయగుంట గుడిలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు ఎమ్మెల్యే రోజా.

   ఆస్తులను భారీగా పెంచారు.

  ఆస్తులను భారీగా పెంచారు.

  ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు తన ఆస్తులను భారీగా పెంచుకున్నారని ఆరోపించారు. అలాగే కుమారుడికి మంత్రి పదవి, కోడలికి ఆస్తులు, భార్యకు ఇల్లు కట్టించారని అన్నారు.

   కక్ష సాధిపు సర్కారే..

  కక్ష సాధిపు సర్కారే..

  ఇప్పటికే పలుమార్లు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల ప్రకారం పనిచేసినందుకే రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి భన్వర్‌లాల్‌పై చంద్రబాబు సర్కారు కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏకే జ్యోతికి బుధవారం ఆయన లేఖ కూడా రాశారు.

   భన్వర్ లాల్‌కు వేధింపులు

  భన్వర్ లాల్‌కు వేధింపులు

  సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల అధికారులుగా నియమితులైన వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకుంటే వారికి ప్రభుత్వం ఎదురయ్యే సమస్యలను ఆయన తన లేఖలో వివరించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భన్వర్‌లాల్‌పై మూసివేసిన కేసులను తిరగదోడి వేధిస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులపై వేధింపులకు తానే సాక్షినని అన్నారు.

  బాబు వ్యూహంలో భాగమే, అందులో దిట్ట: మరోసారి టార్గెట్ చేసిన ఐవైఆర్

  అప్పుడు పదోన్నతి కల్పించకుండా.. ఇప్పుడు మళ్లీ..

  అప్పుడు పదోన్నతి కల్పించకుండా.. ఇప్పుడు మళ్లీ..

  2014 ఎన్నికలప్పుడు టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌కు పదోన్నతి కల్పించకుండా అదే బ్యాచ్‌కు చెందిన ఇతరులకు ఇచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రమోషన్లకు కేసులు అడ్డంకిగా ఉన్నప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ప్రభుత్వం తనపై కేసును మూసివేయకుండా చాలా ఏళ్లు పక్కన పెట్టినప్పటికీ భన్వర్‌లాల్‌ భయపడలేదన్నారు.

  నేనున్నప్పుడు కూడా..

  తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కేసును ఒక కొలిక్కి తేవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. ఆ తర్వాత కేసును మూసివేసి భన్వర్‌లాల్‌కు ప్రమోషన్‌ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పదవీ విరమణ రోజున తిరగదోడటం దమననీతికి అద్ధం పడుతోందని చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP MLA RK Roja and former CS IYR Krishna Rao fired at Andhra Pradesh CM Chandrababu Naidu in various issues

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి