హోటల్ స్టైల్ "చికెన్ ఫ్రైడ్ రైస్" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..?
ఇంట్లోనే సులభంగా, రెస్టారెంట్ స్టైల్‌లో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. సరైన టెక్నిక్, హై ఫ్లేమ్ వంట, సరైన పదార్థాల వినియోగంతో మీరు కూడా బయట తినే టేస్ట్‌ను ఇంట్లోనే పొందవచ్చు. తక్కువ సమయంలో రెడీ అయ్యే ఈ డిష్, పిల్లలు నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. లంచ్ లేదా డిన్నర్‌కు బెస్ట్ ఆప్షన్ గా నిలవడమే కాకుండా ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.
చిట్కాలు..
తాజా అన్నం కంటే ఫ్రిజ్‌లో ఉంచిన అన్నం వాడితే గింజలు విడిగా ఉంటాయి. ఫ్రైడ్ రైస్‌కు రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే హై ఫ్లేమ్‌లో త్వరగా వండాలి. అలానే ఎక్కువ అన్నం ఒకేసారి వేస్తే సరిగా టాస్ అవదు.. అవసరమైతే బ్యాచ్‌లుగా చేయండి. ఎక్కువ సాస్ వేసితే అన్నం తడిగా అవుతుంది కానీ రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకోవచ్చు. తక్కువ నూనె వాడితే అన్నం అంటుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా గరం మసాలా చిటికెడు వేసి ఇండియన్ టచ్ ఇవ్వొచ్చు. ఇక చికెన్ బదులు ప్రాన్స్, ఎగ్ మాత్రమే లేదా పన్నీర్ కూడా వాడవచ్చు.

కావలసిన పదార్థాలు..
- అన్నం: 2-3 కప్పులు (ముందురోజు వండి చల్లార్చినది అయితే బెటర్)
- చికెన్: 150-200 గ్రాములు (చిన్న ముక్కలుగా కోసి, ఉప్పు, మిరియాల పొడితో ఉడికించినది)
- గుడ్లు: 2 (బీట్ చేసినవి)
- వెల్లుల్లి: 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది)
- ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా)
- క్యారెట్, క్యాప్సికమ్: తరిగినవి
- సోయా సాస్: 1 టీ స్పూన్
- చిల్లీ సాస్: 1 టీ స్పూన్
- వెనిగర్: ½ టీ స్పూన్
- మిరియాల పొడి: తగినంత
- నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు: తగినంత
- స్ప్రింగ్ ఆనియన్స్: గార్నిష్ కోసం
తయారీ విధానం..
మొదట పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక చికెన్ ముక్కలను వేసి 3-4 నిమిషాలు వేయించి పక్కన పెట్టాలి.
అదే పాన్‌లో బీట్ చేసిన గుడ్లను వేసి స్క్రంబుల్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో మళ్లీ కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి వేయాలి. సువాసన వచ్చిన వెంటనే ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్‌లో వేయించాలి. (కూరగాయలు పూర్తిగా మెత్తబడకుండా కొద్దిగా క్రంచీగా ఉండేలా చూసుకోవాలి.)
తర్వాత చల్లార్చిన అన్నం వేసి బాగా కలపాలి. వెంటనే సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
ఆ తరువాత వేయించిన చికెన్ ముక్కలు, గుడ్డు ముక్కలను వేసి అన్నంతో బాగా మిక్స్ చేయాలి.
చివరగా హై ఫ్లేమ్‌పై 1-2 నిమిషాలు టాస్ చేస్తూ వేయించాలి.
ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications