బుచ్చయ్య ఘాటు వ్యాఖ్య: రోజా కంటతడి, దూసుకెళ్లిన చెవిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా సోమవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్వేగానికి లోనై, కంటతడి పెట్టారు. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ఈ సమయంలో రోజా పైన బుచ్చయ్య పరుష వ్యాఖ్యలు చేశారు. రోజా సినిమాల్లో కొన్ని విలన్ వేషాలు వేశారని, దానిని ఇక్కడ చూపించారని వ్యాఖ్యానించారు. ఆమె హీరోయిన్‌గా వేషం వేసిందంటూ.. వ్యాఖ్యానించారు. బుచ్చయ్య వ్యాఖ్యల పైన వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ సమయంలో చెవిరెడ్డి, బుచ్చయ్య, రోజా మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ఓ సమయంలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వైపు దూసుకు పోయారు. కాగా, సభ వాయిదా పడిన అనంతరం రోజా ఈ వ్యాఖ్యలను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిని స్పీకర్‌క ఫిర్యాదు చేస్తామని జగన్ వారితో చెప్పారు.
కాగా, అంతకుముందు అచ్చెన్నాయుడు సభలో మాట్లాడుతూ... రుణమాఫీపై మాట్లాడే అర్హత వైయస్ కుటుంబానికి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం అసెంబ్లీలో రుణమాఫీపై వైయస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి అభ్యంతరం తెలిపారు.
సభలో జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకముందని ఆయన అన్నారు. ఈడీ అటాచ్‌మెంట్‌తో దోపిడీ సొమ్మంతా కేంద్రానికి వెళ్తోందని, రైతులపై ప్రేమ ఉంటే దోపిడీ సొమ్మంతా జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications