రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త హిమాలయన్

ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన అడ్వెంచర్ మోటార్ సైకిల్ కొత్త హిమాలయన్ ను విడుదల చేసింది. గోవాలో జరిగిన మోటావోర్స్ ఈవెంట్ లో దీన్ని పరిచయం చేసింది. ధర రూ.2.69 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ప్రస్తుతానికి ఇది ప్రారంభ ఆఫర్ మాత్రమేనని, డిసెంబరు 31 తర్వాత ధరలు పెంచుతామని కంపెనీ స్పష్టం చేసింది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

బేస్ వేరియంట్ ను మౌంటెయిన్ పేరుతో పిలుస్తున్నారు. కాజా బ్రౌన్ రంగులో లభిస్తుంది. మిడ్ వేరియంట్ ను పాస్ గా పిలుస్తారు. ఇది స్లేట్ హిమాలయన్ సాల్్ట, స్టేట్ హిమాలయన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ,.2.74 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ను పీక్ గా పిలుస్తున్నారు. ఇందులో క్యామెంట్ వైట్ ధర రూ.2.79 లక్షలు, హన్లే బ్లాక్ రూ.2.84 లక్షలుగా ఉంది.

royal enfield new bike himalayn launch

ఇంజన్ విషయానికొస్తే 451సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో వస్తోంది. 40.02 బీహెచ్ పీ పవర్ ను, 40 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, ముందువైపు 21 అంగుళాల వీల్, వెనకవైపు 17 అంగుళాల స్పోక్ వీల్స్ తో వస్తోంది. ముందువైపు 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనకవైపు 270 ఎంఎం డిస్క్ అమర్చారు. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ అమర్చారు.

ఇందులో అడ్జస్టబుల్ సీట్ ఉంది. ఎత్తు కావాల్సిన విధంగా 825 ఎంఎం నుంచి 845 ఎంఎం వరకు పెంచుకోవచ్చు. లోయర్ సీటును 805-825 ఎంఎం వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 17 లీటర్ల సామర్థ్యం కలిగిన మెటాలిక్ ట్యాంక్ ను అమర్చారు. బరువు 198 కేజీలు. గూగుల్ తో కలిసి నావిగేషన్ ను డెవలప్ చేశారు. ఎల్ ఈడీ లైటింగ్ తో వస్తోంది. టాప్ స్పీడ్ 150 కిలోమీటర్లు. లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+