RRR : ఫ్యాన్స్ తో ఉపాసన రచ్చ - థియేటర్లో కేకలు..ఈలలతో : ఫుల్ జోష్ లో ఇంకా..!! (వీడియో)
ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తోంది. చెర్రీ - తారక్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఓవర్సీస్ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు సినిమా చూసిన వారి నుంచి ఒకటే మాట. ఓ అద్భుతమైన కళాఖండం. ఇక, ఈ సినిమా కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న జూ ఎన్టీఆర్.. రాం చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దు లేదు. అర్ద్రరాత్రి నుంచే సినిమా ధియేటర్ల వద్ద పండుగ సందడి మొదలైంది. ఇక, ఈ సారి స్పెషల్ గా అటు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ బాబు కు చెందిన ఏఎంబీ సినిమాస్ లో ఆర్ఆర్ఆర్ చూసారు.
Recommended Video

తారక్ - చెర్రీ ఫ్యామిలీల్లో ఫుల్ జోష్
తల్లి..సతీమణి.. పిల్లలతో పాటుగా తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా వీక్షించారు. బయటకు రాగానే డబుల్ థంబ్స్ చూపిస్తూ తన కష్టానికి తగిన ఫలితం కనిపించదనే విధంగా ఆ కళ్లల్లోనే కనిపించింది. ఇక, మరో హీరో రాం చరణ్ సైతం ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసారు. ఆర్ఆర్ఆర్ టీంతో పాటుగా సిబ్బంది చూడటానికి అర్ధరాత్రి ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించారు. దీనికి హాజరైన రాం చరణ్ కస్టమైజ్డ్ టోపీతో క్యాజువల్ లుక్‌లో కనిపించారు. అయితే, చెర్రీ సతీమణి ఉపాసన మాత్రం తన సహజ శైలికి భిన్నంగా థియేటర్ లో రచ్చ చేసారు.
నాటు నాటు సాంగ్ వేళ..ఉపాసన రచ్చ
థియేటర్ లో సినిమా చూస్తున్న ఉపాసన...నాటు నాటు సాంగ్ రాగానే తనలోని అభిమాని బయటకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ - చెర్రీ స్టెప్పులను చూస్తూ తాను ఫ్యాన్స్‌పైనా పేపర్లు చల్లారు. వాటిని గాల్లోకి ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేసారు. తెరపై తన భర్త నటనను చూసి కేకలు, ఈలలు వేస్తూ సాధారణ ప్రేక్షకురాలిలా ఎంజాయ్ చేసారు. ఇప్పుడు ఉపాసన ధియేటర్ లో ఒక ఫ్యాన్ గా చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, సినిమా గురించి అనేక రివ్యూలు బయటకు వచ్చాయి. అన్ని రివ్యూల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది.

ఆర్ఆర్ఆర్ మేనియా.. ఫ్యాన్స్ కు పూనకాలే
కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక, సినిమా విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు పెంపుకు అనుమతి ఇవ్వటంతో... ఇంత కాలం వాయిదా పడినా..ఇప్పుడు విడుదల సమయం నుంచే వస్తున్న భారీ స్పందన.. కలెక్షన్ల విషయం లోనూ మూవీ మేకర్స్ కు పిచ్చ హ్యాపీగా మారింది. ఇక, రాజమౌళి కి ప్రత్యేకంగా ప్రశంసలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications