రూ. 25లక్షల కొత్త నోట్లను చెరువు గట్టులో పాతిపెట్టారు: ఏం జరిగిందంటే..

ఆముదాలవలసలో కొత్త నోట్లు భారీగా బయటపడ్డాయి. చెరువు కట్టలో దాచిపెట్టిన రూ. 25లక్షల విలువైన కొత్త నోట్లు ముగ్గురు చిన్నారుల కంటబడ్డాయి.

శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాలవలసలో కొత్త నోట్లు భారీగా బయటపడ్డాయి. చెరువు కట్టలో దాచిపెట్టిన రూ. 25లక్షల విలువైన కొత్త నోట్లు ముగ్గురు చిన్నారుల కంటబడ్డాయి. ఎవరో దాచి పెట్టిన సొమ్ము దొరకడంతో ముగ్గురూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే, పంపకాల్లో తేడా వచ్చింది. తనకు ఎక్కువ కావాలంటే తనకు ఎక్కువ కావాలని వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రూ. 25లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Unkown people kept Rs. 25 lakhs at pond in Srikakulam district.

నెల్లూరులో దారుణం

నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సదరు మహిళను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్న ఇర్ఫాన్ పఠాన్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు.

గతంలో వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ పఠాన్.. ఆమెను ఇంటిముందే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+