'శబరి' టికెట్ ధరలు పెంపు, వేళలు మార్పు - రెండు గంటలు ఆదా..!!
శబరి ఎక్స్ ప్రెస్ నేడు (మంగళవారం) నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది. గతంతో పోల్చుకుంటే రైలు వేగం పెరగడంతో ఆ రైళ్లలో ప్రయాణించే వారికి సుమారు 2గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. అదే విధంగా టికెట్ ధరల్లోనూ మార్పులు చేసారు. కొత్త టికెట్ ధరలతో పాటుగా ప్రయాణ వేళలను రైల్వే అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ ఈ రోజు (మంగళవారం) నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది. గతంతో పోల్చుకుంటే రైలు వేగం పెరగడంతో ఆ రైళ్లలో ప్రయాణించే వారికి సుమారు 2గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. నిన్న, మొన్నటివరకు సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12.20గంటలకు బయల్దేరే శబరి ఎక్స్‌ప్రెస్ మరుసటి సాయంత్రం 6.05గంటలకు త్రివేండ్రం చేరుకునేది. కాగా, తాజా నిర్ణయం మేరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గా మారాక ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.25 గంటలకు చేరనుంది.

అదే విధంగా ఇంతకుముందు త్రివేండ్రంలో ఉదయం 6.45గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45గంటలకు సికింద్రాబాద్ వచ్చే శబరి ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ గా మారాక త్రివేండ్రంలో ఉదయం 6.45 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు ఉదయం 11 గంటలకు చేరనుంది. శబరి ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ కావడంతో ప్రయాణ సమయం 2గంటలు ఆదా అయ్యే సమయంలోనే సూపర్ ఫాస్ట్ చార్జీల రూపేణా జనరల్ సెకండ్ క్లాస్ టికెట్‌కు రూ.15, స్లీపర్, ఏసీ తరగతుల టికెట్లపై రూ.30నుంచి 40వరకు అదనంగా చెల్లించాల్సి ఉటుంది.
ఇప్పటివరకు దక్షిణమధ్యరైల్వే ఆధ్వర్యంలో ఉండే శబరి ఎక్స్‌ప్రెస్ నిర్వహణ (మెయింటెనెన్స్) బాధ్యతలను నేటినుంచి సదరన్ రైల్వే చేపట్టనుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రైలు ఈ రోజు నుంచి కొత్త మార్పులతో రెండు గంటల ముందే గమ్య స్థానాలకు చేర్చనుంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications