ఐటీ వద్ద చంద్రబాబు వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు..!!

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.

తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసులో ఐటీ శాక అధికారులు దర్యాప్తు సాగిస్తోన్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి.

Chandrababu Naidu

దీనిపై చంద్రబాబు తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయొచ్చని అంచనా వేశారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం దిగుతోందని మండిపడ్డారు. తాను నిప్పునని, ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఏ కేసులో ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన పాపం పండిందనే విషయం చంద్రబాబుకు అర్థమైనట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. చట్టాలకు ఎవరూ అతీతులు కారని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడక తప్పదని, దీనికి చంద్రబాబు అతీతుడేమీ కాదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పటికప్పుడు జరిగిన వ్యవహారం కాదని, 2022 సెప్టెంబర్‌లోనే ఆయనకు నోటీసులను జారీ చేసిందని సజ్జల గుర్తు చేశారు. ఐటీ నోటీసులు వచ్చిన ప్రతిసారీ ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటోన్నాడని చురకలు అంటించారు.

sajjala ramakrishna reddy

వాట్సాప్‌ చాటింగ్, మేసేజీల స్క్రీన్ షాట్లన్నీ ఐటీ అధికారుల వద్ద ఉన్నాయని సజ్జల అన్నారు. వాటి ఆధారంగానే వారు నోటీసులు ఇచ్చారని, దానికి సమాధానం చెప్పకుండా తాను నిప్పు అంటూ తప్పించుకోవడం సాధ్యపడబోదని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన ఆర్థిక నేరాలు, మోసాలు.. ఆధారాలతో సహా ఐటీ అధికారుల వద్ద ఉన్నాయని స్పష్టంచేశారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల్లో భారీగా దోపిడీ చోటు చేసుకుందనడానికి ఐటీ అధికారులు పంపించిన నోటీసులే నిదర్శనమని చెప్పారు. ఒక చదరపు అడుగు నిర్మాణానికి 10,000 రూపాయలను ఖర్చు పెడుతున్నప్పుడే తాము అభ్యంతరం చెప్పామని సజ్జల గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+