Sajjala: అంగన్‍వాడీల సమస్యలు పరిష్కరిస్తామని సజ్జల హామీ..!
అంగన్‍వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. అంగన్ వాడీలతో ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిపామని పేర్కొన్నారు. వారికి వీలైనంతవరకూ మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్‌వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు.
Recommended Video

అంగన్వాడీల కోర్కెలు అన్యాయమని అనడంలేదని సజ్జల మీడియా సమావేశంలో చెప్పారు. ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదని సజ్జల తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకు ఆహారం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందన్నారు. వారికి సేవలు అందకపోవడంవల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయనని సజ్జల గుర్తు చేశారు.

పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్‌వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఇస్తున్నామని పేర్కొన్నారు. హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
దీనిపై మరోసా విజ్ఞప్తి రావడంతో వర్కర్లకు రూ.1.20లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సర్వీసులో ఉండగా చనిపోతే గతంలో రూ.3వేలే ఇచ్చే వారని సజ్జల గుర్తు చేశారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు ఇవ్వాలని కోరగా రూ.20 వేలు ఇస్తామన్నామని పేర్కొన్నారు.
టీఏ, డీఏలు, హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చేలా ఆమోదించామన్నారు. మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపామని పేర్కొన్నారు. మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తామని సజ్జల హామీ ఇచ్చారు. 2014లో అంగన్‌వాడీ వర్కర్లకు వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలకు వేతనాలు పెంచామని గుర్తు చేశారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications