పూర్తిగా మార్పులు తీసుకొస్తున్నాం - సజ్జల..!!
న్యాయస్థానం రిమాండ్‌కు పంపితే అక్కడ బాబు నిరాహార దీక్ష చేయటంపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏదైనా చేశారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలని స్వాతంత్ర్యం వచ్చాకా ప్రజల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. దోపిడీ చేసి జైలుకు వెళ్లి దీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని వివరించారు.
సిఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లో కింది స్థాయి నుంచి మార్పులు తీసుకుని వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దానిలో భాగంగా రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నామని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికీ అర్థం అవుతున్నాయని తెలిపారు. ఆరోగ్య సురక్షా క్యాంపైన్ ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు అవుతోందని ఆయన అన్నారు. మాట్లాడుతూ మార్క్స్, గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్ పాలన చేస్తున్నారని తను అనను అని, స్ఫూర్తితో సిఎం జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రజల కోసం ఏదైనా చేశారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలని స్వాతంత్ర్యం వచ్చాకా ప్రజల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. గ్రామ స్థాయిలో మనం అనేక మార్పులు తేగలిగామని సజ్జల వివరించారు. గ్రామ సచివాలయం ఇరుసుగా ఉంటే దాని చుట్టూ అనేక వ్యవస్థలు పని చేస్తున్నాయన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా విద్య, వైద్య రంగాల్లో మార్పులు తెచ్చామని గుర్తు చేసారు. దీనిద్వారా అందరి జీవితాల్లో మార్పులు తెచ్చామని వివరించారు. అందరి జీవితాల్లో మార్పులు తెచ్చామని చెప్పారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతోందన్నారు. అంతకుముందు 98 లక్షల సర్టిఫికేట్లను కూడా ఇంటికి తీసుకుని వెళ్లి ఇచ్చామని గుర్తు చేసారు.
ఇదంతా కొత్తగా మనం వ్యవస్థను రూపొందించటం వల్లే సాధ్యమైందని వివరించారు.15 మెడికల్ కాలేజీలు, మండలానికి ముగ్గురు డాక్టర్లు చొప్పున నియమించామని గుర్తు చేసారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సీఎం తెచ్చాక అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయన్నారు. అందరి ఆరోగ్యంపై పూర్తి సమాచారం వస్తోందన్నారు. దీని ద్వారా ఎక్కడ ఎలాంటి రీసెర్చ్ సెంటర్లు పెట్టాలో, ఎలాంటి స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలో తెలుస్తుందని వివరించారు. పేరుకు పాలన వైఎస్సార్‌సీపీదే అయినా సీఎం ప్రజల చేతుల్లోనే పాలన పెట్టారన్నారు. నిశబ్ద విప్లవాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని సజ్జల వివరించారు.












Click it and Unblock the Notifications