తెలివిగా తొలగించిన సల్మాన్: ల్యాప్‌టాప్ డేటానే కీలకం

హైదరాబాద్: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్న సల్మాన్ కేసులో ల్యాప్ టాప్ డేటానే కీలకం కానుంది. శంషాబాద్ ఎయర్‌పోర్టులో పోలీసులకు చిక్కిన సల్మాన్ మొయినుద్దీన్ కేసులో ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలో ఏం దాగుందనే సమాచారంతో పోలీసు దర్యాప్తు సాగనుంది.

శంషాబాద్ ఎయర్‌పోర్టులో అరెస్ట్ సమయంలో సల్మాన్ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరికి పంపించారని అయతే అన్ని విషయాలు అత్యంత గోప్యంగా వుంచి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది. అయతే ఉగ్రవాదిగా అనుమానిస్తున్న సల్మాన్ ఉపయోగిస్తున్న ల్యాప్ టాప్‌లో ఉన్న డేటా అత్యంత తెలివిగా డిలీట్ చేసినట్లు పోలీసులకు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వివరాలన్నీ సాంకేతిక నిపుణుల ద్వారా సేకరిస్తున్నట్లు తెలిసింది.

సల్మాన్ ఫేస్‌బుక్, వాట్సప్, మేసేజ్ ,మెయిల్స్ ద్వారా ఫేస్‌బుక్‌లో అతను నిర్వహిస్తున్న న్యూస్ ద్వారా ఎంత మంది ఉద్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారన్న విషయాలు తేలితే మరికొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందగానే నగరంలో మరికొందరిని పోలీసులు ప్రశ్నించే అవకాశాలు వున్నాయ.

 Salman moinuddin case: Laptop will be key for probe

రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో పుట్టి, పెరిగి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన సల్మాన్ సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లోకి చేరేందుకు బయల్దేరి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్‌కు చేరుకుని అక్కడి నుంచి తన గర్ల్‌ఫ్రెండ్‌తో సహా టర్కీ మీదుగా సిరియా చెక్కేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకుని శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్‌పోర్ట్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు.

అతని వద్ద నుంచి లాప్‌టాప్‌, రెండు సెల్‌ఫోన్‌లు, పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సామాజిక వెబ్‌సైట్ల ద్వారా ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ అనుకూల ప్రచారం చేస్తున్న అతడిపై పోలీసులు నిఘా పెట్టడంతో అతడి ప్రణాళికలు బయటపడ్డాయి. పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. హైదరాబాద్‌లోని బజార్‌ఘట్‌కు చెందిన సల్మాన్‌ మొయినుద్దీన్‌ (32) బీటెక్‌ పూర్తిచేశాడు. అనంతరం అమెరికాకు వెళ్లి, అక్కడ టెక్సాస్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్‌ పూర్తి చేసి అక్కడే నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+