వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులకు బలి: సంధ్యారాణి డైరీలో ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు బోధనాస్పత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులకు బలి అయిన పిజి విద్యార్థిని సంధ్యారాణి తన డైరీలో తన ఆవేదనను వ్యక్తీకరించింది. లక్ష్మి వేధింపులు భరించలేక సంధ్యారాణి అనే మెడికో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లక్ష్మి వేధింపులను కమిటీ కూడా నిర్ధారించినట్లు సమాచారం.

సంధ్యారాణి మృతి తర్వాత లక్ష్మి కనిపించకుండా పోయారు. పది రోజులుగా ఆమె జాడ కనిపించడం లేదు. అలాంటి మనిషి ఉంటుందని తాను ఊహించలేదని, విద్యార్థులంటే ఆమెకు పురుగులతో సమానమని సంధ్యారాణి తన డైరీలో రాసింది. లక్ష్మి తిట్లు భరించడం తన వల్ల కావడం లేదని, జిజిహెచ్ గైనకాలజీ విభాగం చెడిపోయిందని, ప్రొఫెసర్ లక్ష్మిని బోధనాస్పత్రిలోనే ఉంచవద్దని ఆమె రాసింది.

తన మరణం పోలీసులకు అస్త్రం కావాలని కూడా ఆమె అభిప్రాయపడింది. తన ఆవేదనను సంధ్యారాణి తన డైరీలో కన్నీటి తడి పెట్టించేలా వ్యక్తం చేసింది. ఆ విషయాలు శుక్రవారం మీడియాలో వచ్చాయి. ఆమె డైరీలోని మాటలు ఇలా ఉన్నాయి.

బాలింతను జుట్టు పట్టి..: ప్రొఫెసర్ లక్ష్మి పైశాచికానికి నిదర్శనాలివే!బాలింతను జుట్టు పట్టి..: ప్రొఫెసర్ లక్ష్మి పైశాచికానికి నిదర్శనాలివే!

Sandhya Rani's suicide note reveals Lakshmi's attitude

ప్రొఫెసర్‌ లక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. ఆమెను ఎక్కడా బోధనలో ఉండకుండా చేయండి. నాలాగా మరే విద్యార్థినీ బలి కాకూడదు. ఆమెలాంటి సైకో చేతిలో నాలాంటి వారు ఎందరో బాధపడుతున్నారు. ఆమెలాంటి మనిషి సమాజంలో ఉంటుందని, మన మధ్యే తిరుగుతోందని ఎవరూ ఊహించలేరు. విద్యార్థులైనా, రోగులైనా, కిందిస్థాయి సిబ్బంది అయినా ఆమెకు పురుగులతో సమానం.

ఆమెను కన్విన్స్ చేయాలని ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. భర్త వద్దకు వెళ్లాలని సెలవు కోరితే... ఆమె వాడిన భాష మనిషి నోటి నుంచి వచ్చేది కాదు. జీజీహెచ్ గైనకాలజీ విభాగం పూర్తి స్థాయిలో చెడిపోయింది. నా మరణంతోనైనా ఆమెకు పడే శిక్షతో ఆ విభాగం బాగుపడాలని, విద్యార్థులు సంతోషంగా చదువులు పూర్తి చేయాలని కోరుకుంటున్నా. నా మరణం పోలీసులకు ఆయుధం కావాలని కోరుకుంటున్నా!

అందుకే లోకం విడిచి పోతున్నా..

నాన్నా.. నన్ను చదివించేందుకు ఎంతో కష్టపడ్డావు. గైనకాలజీ డాక్టర్‌గా చూడాలని కలలు కన్నావు. నీ కలలు నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించు. అమ్మని, అక్కని జాగ్రత్తగా చూసుకో. ఒక్కసారి ఇంటికి రావాలని ఉంది. మిమ్మల్ని చూడాలని ఉంది. కానీ ఇక్కడ లీవ్‌ ఇచ్చే వారు లేరు. నన్ను క్షమించు నాన్నా. నా మానసిక స్థితి పూర్తిగా భరించలేని స్థితికి చేరింది. అందుకే లోకం విడిచి పోతున్నా

ఇంతటి మంచి భర్త దొరకడం అదృష్టం

నీలాంటి మంచి భర్త దొరకడం అదృష్టం. మా అమ్మను, నాన్నను కూడా చూడు. నేను ఈ లోకంలో బతికేందుకు ఇష్టపడడం లేదు. ఇటువంటి అవమానకరమైన జీవితాన్ని భరించలేను. అందుకే చచ్చిపోతున్నాను. రోజూ తిట్లు భరించడం నా వల్ల కావడం లేదు. ఇంత టెన్షన్ నేనెప్పుడూ పడలేదు. నాకే ఎందుకిలా జరుగుతోంది? కానీ నీవు మాత్రం జీవితంలో కుంగి పోవద్దు!

మీరు నా నిజమైన స్నేహితులు

అన్నయ్యా, చిన్నీ... ఈ ప్రపంచంలో మీరు నా నిజమైన స్నేహితులు. ఈ టార్చర్‌ భరించలేక మిమ్మల్ని అందర్నీ వదలి వెళ్లిపోతున్నా. అన్నయ్యా, మమ్మీ డాడీలను బాగా చూసుకో. నేనెప్పుడూ ఇలా అనుకోలేదు... నా కళ్లు నొప్పులుగా ఉన్నాయి. రోజూ ఏడ్చి, ఏడ్చి కుంగి పోయాను.

ఇక చాలు. ఈ లైఫ్‌ను భరించలేను. సారీ అన్నయ్యా. చిన్నీ... నేను వెళ్లిపోయానని బాధ పడొద్దురా! నేనెప్పుడు సెలవులకు వచ్చినా ఎక్కడకు వెళ్దామన్నా తీసుకెళ్లేవాడివి. నీకంత ఓపిక ఎలా వచ్చిందిరా! మమ్మీ డాడీలకు రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌ చేయించు.

English summary
The medico, Sandhya rani, committed suicide has expressed her agony at GGH due to professor Lakshmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X