గోదావరి సంక్రాంతి సంబరాల్లో అరుదైన ఈవెంట్స్..!!
సంక్రాంతి సంబరాలకు గోదావరి ది ప్రత్యేక స్థానం. ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగ కోసం అనేక ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలి వస్తారు. ఆంధ్ర కేరళగా ప్రసిద్ధి చెందిన కోనసీమ లో ఈ సారి సంక్రాంతికి ప్రత్యేక ఈవెంట్లు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి సంక్రాంతికి గోదావరి జిల్లాలకు చేరుకంటున్నారు. కోడి పందేల కోసం బరులు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో కేరళ తరహాలో ఈ సారి పడవ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
సంక్రాంతి సంబరాలు
గోదావరిలో ఈ సారి సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గోదావరి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ సారి కోనసీమ లో పడవ పోటీలు జరగనున్నాయి. గోదావరి గలగలలు, చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని చేల నడుమ పంట కాలువల్లో ఈ పడవ పోటీల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పూత రేకులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆత్రేయపురం ఈ అరుదైన ఈవెంట్ కు వేదిక కానుంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో పడవ, ఈత పోటీలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.

పడవ - ఈత పోటీలు
ఈ పోటీల్లో ఉమ్మడి ఉభయ గోదావరితో పాటు అనంతపురం, విశాఖ, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన జట్లు పోటీ పడుతున్నాయి. కాగా, ఈ సారి డ్రాగన్ పడవలు ఈ పోటీల్లో6 ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటే మహిళలకు రంగవల్లుల పోటీలు, చిన్నారులు, యువతకు గాలిపటాల పోటీలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేస్తు న్నారు. పర్యటక ప్రాంతంగా లొల్ల లాకులకు పేరుంది. ఈ ప్రాంతంలో పడవ పోటీల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఆత్రేయపురం నుంచి ఉచ్చిలి మధ్య ప్రధాన పంట కాలువలో సుమారు వెయ్యి మీటర్ల పరిధిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

ఏర్పాట్లు - బహుమతులు
ఈ పోటీలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అదే విధంగా విజేతలకు బహు మతులు ఇవ్వాలని నిర్ణయించింది. పడవ పోటీల్లో ప్రథమ విజేతకు రూ.లక్ష, ద్వితీయ స్థానం సాధిస్తే రూ.50 వేలు, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.30 వేలు నగదు బహుమతి గా ఇవ్వనున్న ట్లు ప్రకటించారు. అలాగే ఈత, గాలిపటాల పోటీలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7,500 చొప్పున మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, గోదావరి లో ఈ సారి సంక్రాంతి సంబరాలు అరుదైన గుర్తింపు దక్కించుకోనున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications