సంక్రాంతి ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్..! ఉచిత బస్సుకు ఇలా..!
ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాలు, పట్టణాల నుంచి ఊర్లకు ప్రయాణాలు ఎక్కువగా సాగుతుంటాయి. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ప్రయాణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దీంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంటుంది. ఇదే క్రమంలో ఈసారి కూడా సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ 8432 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఇవాళ వెల్లడించింది.
ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఎప్పటిలాగే ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సుల్లో 71 శాతం బస్సుల్ని సంక్రాంతి ప్రత్యేక బస్సులుగా మార్చి వాడబోతోంది. ఈ లెక్కన ఆరు వేల బస్సుల్ని ప్రత్యేక ప్రయాణాలకు వాడతారు. సర్వీసుల వారీగా చూసుకుంటే మొత్తం 8432 అదనపు బస్సుల్ని ప్రకటించారు. ఇందులో కేవలం రాష్ట్రంలో ప్రయాణాలకు మాత్రమే 3500 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు.

మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు పండగ తర్వాత తిరిగి చేరుకునేందుకు వీలుగా మరో 4575 అదనపు బస్సులు అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో హైదరాబాద్ కు అత్యధికంగా 1800 బస్సుల్ని అందుబాటులో ఉంచుతారు. అలాగే సంక్రాంతికి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు కాకుండా సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి కూడా కొంతమేర అడ్డుకట్ట పడనుంది.

మరోవైపు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న స్త్రీ శక్తి పథకంపై ఈ సంక్రాంతి అదనపు బస్సుల కేటాయింపు ప్రభావం పడబోతోంది. ప్రస్తుతం స్త్రీశక్తి పథకానికి వాడుతున్న బస్సుల్లో కొన్ని ఈ ప్రత్యేక సర్వీసులుగా వాడనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే పండుగ రోజుల్లో మాత్రం స్త్రీశక్తి పథకం బస్సులపై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications