అన్నవరంలో షష్టి కల్యాణ మహోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగే షష్టి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి ఏకాద
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగే షష్టి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం రాత్రి దేవస్థానం హైస్కూల్ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన కళావేదికపైన వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది. వేదమంత్రోచ్చారణల మధ్య పండితులు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications