ఏపీలోని పాఠశాలలకు మళ్లీ సెలవులు- ఎన్నికల వేళ తాజా ఉత్తర్వులు..!!
దసరా సెలవులు ఈ రోజుతో పూర్తి అవుతున్నాయి. అక్టోబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురువారం (22వ తేదీ) నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. ఇదే సమయంలో కీలక అప్డేట్ వచ్చింది. ఏపీలో స్థానిక ఎన్నికల వేళ పాఠశాలలకు సెలవులు రానున్నాయి. మున్సిపల్ పోలింగ్.. జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలోని పాఠశాలలకు దసరా పండుగ సెలువులు ముగిశాయి. రేపు (గురువారం) తిరిగి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. అయితే.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. దీంతో, పోలింగ్ రోజు అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ వేళ సెలవు ప్రకటించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి సెలవులు ప్రకటించే పూర్తి అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ రెండు రోజుల పాటు తప్పనిసరిగా ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. అదే విధంగా 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. దీంతో.. ఆ రోజున పలు ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వం కీలక ఆదేశాలు
కాగా.. అక్టోబర్ 25వ తేదీన ఆదివారం. ఇక 27, 28 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నవంబర్ 3న పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, దుకాణాల కార్మికులకు సెలవు కల్పించనున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నవంబర్ 2న స్థానిక సెలవు ప్రకటించనున్నారు. నవంబర్ 1 ఆదివారం కావడంతో కొన్ని వర్గాల ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే, సెలవులు ఆయా ప్రాంతాలు, సంస్థల గురించి స్థానికంగా ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా అమలు కానున్నాయి.












Click it and Unblock the Notifications
