Feast of Tabenacle: గుంటూరులో క్రైస్తవుల పండుగ- ఈ తేదీల్లో 4 ప్రత్యేక రైళ్లు..!

ఏపీలోని గుంటూరు (guntur)లో జరిగే క్రైస్తవుల 49వ గుడారాల పండుగ (feast of tabernacle) కోసం వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ పండుగకు విజయవాడ, కాకినాడ నుంచి వెళ్లే క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా నాలుగు రైళ్లను ప్రకటించింది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న నాలుగు మెమూ రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ.. వీటి స్ధానంలో నాలుగు ఛైర్ కార్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ విడుదల చేసింది.

కాకినాడ పోర్టు నుంచి విజయవాడకు(రైలు నంబర్ 17258), విజయవాడ నుంచి గుంటూరుకు (రైలు నంబర్ 67229)ఈ నెల 5 తేదీన రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. అలాగే గుంటూరు నుంచి విజయవాడకు (రైలు నంబర్ 67230), విజయవాడ నుంచి కాకినాడ పోర్టుకు (రైలు నంబర్ 17257)ను ఈ నెల 8వ తేదీన నడుపుతున్నట్లు రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లలో కేవలం 18 చైర్ కార్ కోచ్ లు మాత్రమే ఉంటాయి.

SCR Boosts Guntur Festival Travel 4 Chair Car Specials to Run From Kakinada Vijayawada

ఈ రైళ్ల ప్రకటన కారణంగా ప్రస్తుతం నడుస్తున్న రాజమండ్రి-కాకినాడ పోర్టు మెమూ రైలు, కాకినాడ-విశాఖపట్నం మెమూ రైలు, విశాఖపట్నం-కాకినాడ పోర్టు మెమూ రైళ్లను ఈ నెల 4వ తేదీన రద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి మెమూ రైలును ఈ నెల 9వ తేదీన రద్దు చేశారు. రైళ్లు, కోచ్ ల సర్దుబాటు కారణంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఈ మార్పుల్ని గమనించి రాకపోకలకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+