ఉబేర్ డ్రైవర్ బాధితురాలిని చంపడానికి ప్రయత్నించాడు: డాక్టర్

న్యూఢిల్లీ: అత్యాచార బాధితురాలి మెడపై రక్కిన గీతలు కనిపించాయని, దాన్ని బట్టి ఆమెను చంపడానికి ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని అనిపిస్తోందని అత్యాచార బాధితురాలిని పరీక్షించిన వైద్యురాలు చెప్పారు. 25 ఏళ్ల మహిళపై ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివర కుమార్ యాదవ్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.

సంఘటన జరిగిన తర్వాత బాధితురాలిని పరీక్షించిన వైద్యురాలు కోర్టు ముందు ఆ విషయం చెప్పారు. బారా హిందూ రావు ఆస్పత్రికి చెందిన డాక్టర్ కావేరి ప్రాసిక్యూషన్ సాక్షిగా సోమవారం కోర్టు ముందు హజరయ్యారు. రెండో వైద్య అభిప్రాయం కోసం నిరుడు డిసెంబర్ 6వ తేదీన బాధితురాలిని ఆమె వద్దకు తీసుకుని వచ్చారు. ఆమెను అప్పటికే మరో డాక్టర్ పరీక్షించారు.

Scratches on Uber rape survivor’s neck suggest strangulation attempt: Doctor

బాధితురాలి మెడపై గాట్లు కనిపించాయని, ఆమె దేహంపై కనిపించిన ఇతర గాయాల గురించి వైద్య నివేదికలో ఇప్పటికే మరో డాక్టర్ చెప్పారని కావేరి అదనపు సెషన్స్ జడ్జి కావేరీ బవేజా ముందు చెప్పారు. మెడపై గాట్లను బట్టి శివకుమార్ యాదవ్ ఆమెను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని అనుకోవచ్చునని డాక్టర్ చెప్పారు

ఆమె ప్రైవేట్ అంగాలపై కనిపించి ఎర్ర మరకలు ఇన్‌ఫెక్షన్ వల్ల జరిగినవి కావని, లైంగిక దాడి కారణంగా అయినేవనని డాక్టర్ చెప్పారు. ఉబేర్ క్యాబ్ డ్రైవర్ 25 ఏళ్ల మహిళపై నడిరాత్రి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+