అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్ మనీ: రాజధానిలో యలమంచిలి రాముకు భారీ ఆస్తులు, 'రియల్' ఫ్రాడ్.. పెర్ల్ ఆగ్రోపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాల్ మనీ - సెక్స్ రాకెట్ నిందితుడు యమలమంచిలి రాము ఆస్తుల పైన అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతిలోనూ భారీగా ఆస్తులు ఉన్నాయి.

యలమంచిలి రాము భార్య విజయలక్ష్మి పేరుతో అవి ఉన్నట్లుగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తుళ్లూరులో 1.40 ఎకరాలు, ఉద్దండరాయునిపాలెంలో 2.89 లక్షలు, లింగాయపాలెంలో 89 సెంట్లు, వెంకటపాలెంలో 48.9 సెంట్లు, మరోచోట 50 సెంట్లు ఉన్నట్లుగా గుర్తించారు.

విజయలక్ష్మి పేరుతో 3 యాక్సిస్ బ్యాంకు చెక్కుబుక్కులు ఉన్నాయని గుర్తించారు. వరప్రసాద్, సుగుణ రాఘవ పేరుతోను చెక్కుబుక్కులు గుర్తించారని తెలుస్తోంది. అలాగే, భవనాదేవి, జశ్వంత రావు, వెంకటేశ్వర రావు పేరుతో పట్టా పుస్తకాలు, శ్రీనివాస్ పేరుతో ఉన్న హెచ్‌డీఎఫ్‌సి చెక్ బుక్కు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

Searches in Yalamanchili Ramu residence

పెర్ల్ ఆగ్రో పైన సిఐడిలో కేసు

ప్లాట్లు, ఇళ్లు ఇస్తామని బాధితుల నుంచి డబ్బులు తీసుకొని, ఇప్పటి వరకు ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పెర్ల్ ఆగ్రో సంస్థ పైన ఏపీ సిఐడిలో కేసు నమోదయింది. పెర్ల్ ఆగ్రో కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్లాట్లు, ఇళ్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి ఇవ్వలేదని గతంలో ఫిర్యాదులు అందాయి.

దీనిపై ఇప్పుడు ఏపీ సీఏడీలో కేసు నమోదయింది. రియల్ ఎస్టేట్ పేరుతో రూ.1600 కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కేవలం విజయవాడలోనే రూ.600 కోట్లు వసూలు చేసింది. పది లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. పెర్ల్ ఆగ్రో పైన ఇప్పటికే సెబి నిషేధం విధించింది.

English summary
Searches in Yalamanchili Ramu residence, who is in Call Money racket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X