సికింద్రాబాద్ వందే భారత్‌‌ ఎక్స్‌ప్రెస్‌లో సిగరెట్ కంపు?

Vande Bharat express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

Security breach in Visakhapatnam- Secunderabad Vande Bharat express

ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో భద్రత కొరవడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి అద్దం పట్టినట్టయింది. భద్రత గురించి ప్రయాణికుల్లో ఉన్న ఆందోళనను రెట్టింపు చేసినట్టయింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టాయ్‌లెట్‌లో ఓ ప్రయాణికులు సిగరెట్ తాగాడు. ఈ పొగ మొత్తం ఆ కోచ్‌లో అలముకుంది. సిగరెట్ పొగ ఘాటుతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మహిళలు, వయోధిక వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించినట్లుగా చెబుతోన్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ విషయాన్ని టికెట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందన ప్రయాణికులు చెబుతున్నారు. సిగరెట్ పొగ ఘాటు వల్ల తాను కూడా ఇబ్బంది పడ్డానంటూ టీసీ ప్రయాణికులతో చెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. రెండు నిమిషాలు ఈ రైలును నిలిపివేసి డోర్లను తీయాలంటూ ఒకరిద్దరు ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిస్తోన్న 20707/20708 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోన్న రైలు ఇది. అత్యంత ఆదరణ ఉండే సర్వీసుల్లో ఇదీ ఒకటి. ఆ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీని కోచ్‌ల సంఖ్యను సైతం పెంచారు రైల్వే అధికారులు. అలాంటి ప్రజాదరణ ఉన్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన సంభవించడం చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+