అచ్చం జగన్ లాగే మరో వ్యక్తి ... ఎక్కడో కాదు ఇక్కడే ! ప‌్రత్యర్ధులకు దొరికితే అంతే..!
జగన్ అభిమానులకు ఓ ఆసక్తి కరమైన వార్త. జగన్ ను పోలిక మరో వ్యక్తి చిత్రం బయటకు వచ్చింది. అచ్చం జగన్ లాగానే ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. మనిషిని పోలిన మనిషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతారు. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఓ పార్టీ అధినేత అయిన జగన్ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉన్న ఈ వ్యక్తి సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
జగన్ పోలికలతో అచ్చంగా..
వైసిపి అధినేత ఇప్పుడు ఏపి రాజకీయాల్లోనే కాదు..ఎన్నికల పైన జాతీయ సంస్థల సర్వే నివేదికలతో జాతీయ స్థాయిలోనూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇక్కడ సభలు పెట్టినా జనం పోటెత్తారు. ఈనెల 11న ఏపిలో జిరగిన పోలింగ్ పైన జగన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత తమ పార్టీకి లాండ్ స్లైడ్ విక్టరీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇక, ఫలితాల వెల్లడికి నెలకు పైగా సమయం ఉంది.
అచ్చం జగన్ లాగానే : ఆయన్ను వైసిపి ఫ్యాన్స్ చూస్తేనా..: ప‌్రత్యర్ధులకు దొరికితే ఇక..! pic.twitter.com/Kjhb3ogrtm
— Oneindia Telugu (@oneindiatelugu) April 21, 2019
ఇవన్నీ ఇలా ఉంటే..ఏపిలో వైయస్ జగన్‌కు ధీటుగా తెలంగాణలో అచ్చం అదే విధంగా ఉండే మరో వ్యక్తి అక్కడి ప్రజల దృష్టిలో పడ్డారు. చూడగానే ఎవరైనా జగనా అని అనుకోవాల్సిందే. జగన్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలో కడప జిల్లాలో ఓ వ్యక్తి పొలంలో మంచినీళ్లు తాగుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అచ్చంగా ఆ వ్యక్తి జగన్ లాగానే ఉండటంతో లక్షలాది వ్యూస్..లైక్‌లు వచ్చాయి.
ఇప్పుడు తెలంగాణాలో..
ఇక, ఇప్పుడు తెలంగాణాలో అదే తరహాలో జగన్ పోలికలతో ఓ వ్యక్తి వెలుగు లోకి వచ్చాడు. కొద్ది రోజులుగా అతడి గురించి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి పేరు రమేష్. జగన్ తరహాలో వస్త్ర ధారణ..గడ్డం..చేతులు ఊపటం వంటి వాటితో మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇక, జగన్ గా అతడిని భావిస్తున్న కొందరు అతడితో వీడియో తీసి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తున్నారు.

దీంతో.. ఇప్పుడు జగన్ అభిమానులు ఆ వ్యక్తిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ నాయకులను పోలిన వ్యక్తుల కోసం సహజంగానే వెతుకుతూ ఉంటారు. తాజాగా ఆయన సినిమాల్లో ఎన్టీఆర్..చంద్రబాబు వంటి వారి పాత్ర ధారణ కోసం అదే పోలికలతో ఉన్న వారిని వెతికి పట్టుకొని సినిమా తీసారు. ఇక, ఇప్పుడు జగన్ పైన ఎవరైనా సినిమా తీయాలనుకుంటే రమేష్ సరిగ్గా సరిపోతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications